జాతీయ వార్తలు 2015 (National News 2015)
జనవరి 2015:
-
2015, జనవరి 1: ప్రణాళికా సంఘం స్థానంలో "నీతి ఆయోగ్" అవతరించింది.
- 2015, జనవరి 2: గుజరాత్‌లోని అకోదరలో ఐసిఐసిఐ డిజిటల్ గ్రామాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి జాతికి అంకితం చేశారు.
- 2015, జనవరి 3: 102వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సు ముంబాయిలో ప్రారంభమైంది.
- 2015, జనవరి 5: నీతి ఆయోగ్ తొలి వైస్-చైర్మెన్‌గా అరవింద్ పసగడియా నియమితులైనారు.
- 2015, జనవరి 5: శృంగేరి శారదా పీఠాధిపతిగా కుప్పూరు వెంకటేశ్వర ప్రసాద్ శర్మ నియమితులైనారు.
- 2015, జనవరి 6: మేఘాలయ గవర్నరుగా కేసరినాథ్ త్రిపాఠి భాధ్యతలు స్వీకరించారు.
- 2015, జనవరి 6: బెంగాలి నటి రూపాగంగూలి భారతీయ జనతాపార్టీలో చేరారు.
- 2015, జనవరి 7: 13వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు గాంధీనగర్‌లో ప్రారంభమైనాయి.
- 2015, జనవరి 9: డిఎంకె అధ్యక్షుడిగా కరుణానిధి 11వ సారి ఎన్నికయ్యారు.
- 2015, జనవరి 9: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించబడింది.
- 2015, జనవరి 13: ఇస్రో చైర్మెన్‌గా కిరణ్ కుమార్ అలూర్ సిలిన్ నియమితులైనారు.
- 2015, జనవరి 15: కిరణ్ బేడి భాజపాలో చేరారు.
- 2015, జనవరి 19: ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడి పేరును భాజపా ప్రకటించింది.
- 2015, జనవరి 19: సెన్సార్ బోర్డు కొత్త చైర్మెన్‌గా పహ్లాద్ నిహలాని నియమించబడ్డారు.
- 2015, జనవరి 23: శృంగేరి శారదా పీఠం అధిపతిగా విధుశేఖర స్వామి సన్యాసం స్వీకరించారు.
- 2015, జనవరి 26: లాల్‌కృష్ణ అడ్వాణి, అమితాబ్ బచ్చన్‌లలతో పాటు 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పదంభూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.
- 2015, జనవరి 28: భారత మాజీ హాకీ ఆటగాడు జస్వంత్ సింగ్ మరణించారు.
- 2015, జనవరి 29: గూర్ఖాలాండ్ ఉద్యమ నాయకుడు సుభాష్ ఘీషింగ్ మరణించారు.
- 2015, జనవరి 29: సంగీత నాటక అకాడమీ చైర్మెన్‌గా శేఖర్ సేన్ నియమితులైనారు.
ఫిబ్రవరి 2015:
- 2015, ఫిబ్రవరి 1: రియాలిటి షో "బిగ్‌బాస్ హల్లాబోల్" విజేతగా గౌతం గులాటి నిలిచారు.
- 2015, ఫిబ్రవరి 4: జేకే గ్రూపు అధినేత గౌర్ హరి సింఘానియా మరణించారు.
- 2015, ఫిబ్రవరి 6: మరాఠి రచయిత బాలచంద్ర నెమడేకు 2014 సంవత్సరపు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించబడింది. (జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతల పట్టిక)
- 2015, ఫిబ్రవరి 7: మహారాష్ట్రలోని సిరోంచ తాలుకా వడిదం అటవీప్రాంతంలో క్రీ.పూ.14-16 శతాబ్దికాలం నాటి అవశేషం బయటపడింది.
- 2015, ఫిబ్రవరి 9: మనదేశానికి చెందిన రికీకేజ్, నీలావిశ్వానీలకు గ్రామీ అవార్డు లభించింది.
- 2015, ఫిబ్రవరి 10: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP (ఆమ్ ఆద్మీ పార్టీ) భారీ విజయాన్ని నమోదుచేసింది.
- 2015, ఫిబ్రవరి 13: బెంగుళూరు సమీపంలో ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి 8 మంది మరణించారు.
- 2015, ఫిబ్రవరి 13: కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలో రెండో అత్యుత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది.
- 2015, ఫిబ్రవరి 16: ఎన్సీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ మరణించారు.
- 2015, ఫిబ్రవరి 16: లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా రాంవిలాస్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు.
- 2015, ఫిబ్రవరి 20: బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ రాజీనామ చేశారు.
- 2015, ఫిబ్రవరి 20: టోల్‌టాక్సుల వ్యతిరేఖ ఉద్యమ నేత గోవింద్ పన్సారే మరణించారు.
- 2015, ఫిబ్రవరి 22: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. (బీహార్ ముఖ్యమంత్రుల జాబితా) , (రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రులు)
- 2015, ఫిబ్రవరి 24: కేంద్రపన్నులలో రాష్ట్రాల వాటా 42%కి పెంచాలని సిఫార్సు చేసిన 14వ ఆర్థిక సంఘం సూచనను కేంద్రం ఆమోదించింది.
- 2015, ఫిబ్రవరి 26: రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు లోకసభలో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టారు.
- 2015, ఫిబ్రవరి 28: ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మార్చి 2015:
- 2015, మార్చి 1: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీమహ్మద్ ప్రమాణస్వీకారం చేశారు. (జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితా)
- 2015, మార్చి 2: నాయుడమ్మ పురస్కారం టెస్సీ థామస్, గీతావరదన్‌లకు ప్రకటించబడింది.
- 2015, ఫిబ్రవరి 2: బీసిసిఐ అధ్యక్షుడిగా జగ్‌మోహన్ దాల్మియా ఎన్నికయ్యారు.
- 2015, మార్చి 4: ఆప్ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు.
- 2015, మార్చి 4: ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లను పీఏసీ నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ తొలగించింది.
- 2015, మార్చి 5: కేంద్ర మంత్రిపదవికి రావుసాహెబ్ దాన్వే రాజీనామా చేశారు.
- 2015, మార్చి 8: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ మెహతా మరణించారు.
- 2015, మార్చి 17: జాట్‌లను ఓబీసీ జాబితాలో చేరుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
- 2015, మార్చి 20: యువతకు నైపుణ్యం ఇచ్చేందుకు కేంద్రం "ప్రధాన్‌మంత్రి కౌశల్ వికాస్ యోజన" పథకాన్ని ప్రారంభించింది.
- 2015, మార్చి 20: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలో ఘోర రైలుప్రమాదం జరిగి 45 మంది మరణించారు.
- 2015, మార్చి 20: విశ్వభారతి ఛాన్సలర్‌గా ప్రధాని నరేంద్రమోడి నియమితులైనారు.
- 2015, మార్చి 23: శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించబడింది.
- 2015, మార్చి 24: 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు:
జాతీయ ఉత్తమ చిత్రం: కోర్ట్ (మరాఠి), జాతీయ ఉత్తమ నటి: కంగనా రనౌత్ (క్వీన్), జాతీయ ఉత్తమ నటుడు: విజయ్ (కన్నడ), ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (బెంగాలీ), ఉత్తమ హిందీ చిత్రం: క్వీన్, ఉత్తమ తెలుగు చిత్రం: చందమామ కథలు
- 2015, మార్చి 27: మిజోరాం మాజీ ముఖ్యమంత్రి బ్రిగ్‌సైలో మరణించారు.
- 2015, మార్చి 27: అటల్ బిహారి వాజపేయికి భారతరత్న పురస్కారం ప్రధానం చేయబడింది.
- 2015, మార్చి 27: ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి-2014 ప్రకటించబడింది.
- 2015, మార్చి 28: పీఎస్‌ఎల్‌వి సీ-27 షార్ నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది.
- 2015, మార్చి 28: మిజోరం గవర్నర్ అజీజ్ ఖురేషిని పదవి నుంచి తొలగించారు. పశ్చిమబంగ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు.
- 2015, మార్చి 30: రాష్ట్రపతిచే 9 గురికి పద్మవిభూషణ్, 29 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించబడింది.
- 2015, మార్చి 29: మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌చే రచించిన "ఇండియా శస్త్ర" పుస్తకం ఆవిష్కరించబడింది.
- 2015, మార్చి 29: మిస్ ఇండియా వరల్డ్-2015 గా ఢిల్లీకి చెందిన ఆదితి ఆర్య ఎంపికైంది. మొదటి రన్నరప్‌గా ఆఫ్రీన్ రేచల్, రెండో రన్నరప్‌గా వర్తికాసింగ్‌లు నిలిచారు.
- 2015, మార్చి 29: భారతీయ జనతాపార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఏప్రిల్ 2015:
- 2015, ఏప్రిల్ 1: భారతీయ రిజర్వ్ బ్యాంక్ 80 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
- 2015, ఏప్రిల్ 1: రూ. 12వేల కోట్లతో చేపట్టిన రూర్కెలా ఉక్కుకర్మాగారం విస్తరణ పనులకు ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
- 2015, ఏప్రిల్ 5: ప్రపంచ వ్యాప్తంగా 600 సందర్శనీయ ప్రాంతాలలో భారత్‌కు చెందిన 4 నగరాలు ఎంపికయ్యాయి. (జైపూర్, ఢిల్లీ, ముంబాయి, జైసల్మార్).
- 2015, ఏప్రిల్ 9: మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చి 100 సంవత్సరాలు పూర్తయింది.
- 2015, ఏప్రిల్ 18: కోల్‌కత నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయి.
- 2015, ఏప్రిల్ 21: ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్ మరణించారు.
- 2015, ఏప్రిల్ 22: చరణ్‌సింగ్ సమాధికి "జన్‌నాయక్" పేరు ఖరారు చేశారు.
- 2015, ఏప్రిల్ 23: పశ్చిమబెంగాల్‌లో 6 పట్టణాలకు పేరుమార్చారు: సిలిగురి → తీస్తా, బోల్‌పూర్ → గీతాబితన్, అసన్‌సోల్, దుర్గాపూర్ → అగ్నిబినా, గాజోల్ దోబ → ముక్తతీర్థ, గరియా → ఉత్తమ్‌సిటి, కల్యాణి → సమృద్ధి.
- 2015, ఏప్రిల్ 28: పశ్చిమబెంగాల్ పురపాలక సంఘం ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది.
- 2015, ఏప్రిల్ 28: ఉత్తర ఢిల్లీ మేయర్ ఎన్నికలలో భాజపా విజయం సాధించింది.
మే 2015:
- 2015, మే 1: 10 లక్షల జనాభా మించిన నగరాలలో కూడా మెట్రో రైలును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు.
- 2015, మే 4: మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో బస్సు కాల్వలో పడి నిప్పు అంటుకొని 21 మంది సజీవ దహనం అయ్యారు.
- 2015, మే 5: భారత సైన్యంలో ఆకాశ్ క్షిపణి ప్రవేశపెట్టబడింది.
- 2015, మే 7: కేంద్ర ఎన్నికల కమీషనర్‌గా ఎ.కె.జ్యోతి నియమితులైనారు.
- 2015, మే 11: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టులో జయలలితకు విముక్తి లభించింది.
- 2015, మే 18: జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ద్రౌపది ముర్ము పదవి స్వీకరించారు.
- 2015, మే 20: మేఘాలయ గవర్నరుగా షణ్ముగనాథన్ పదవి స్వీకరించారు. (అన్ని రాష్ట్రాల గవర్నర్లు)
- 2015, మే 23: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారం చేశారు.(తమిళనాడు ముఖ్యమంత్రుల జాబితా)
- 2015, మే 30: దేశీయ కరెన్సీ పేపర్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను హోషంగాబాదు (మధ్యప్రదేశ్)లో ప్రారంభించబడింది.
- 2015, మే 30: నలందా విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా సింగపూర్ మాజీ మంత్రి జార్జ్ యో నియమితులైనారు.
- 2015, మే 31: 12.36% సేవాపన్ను (సర్వీస్ టాక్స్) స్థానంలో 14% సేవా పన్ను అమలులోకి వచ్చింది.
జూన్ 2015:
- 2015, జూన్ 1: అటల్ బిహారీ వాజపేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం "ఫ్రెండ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్" అవార్డు ప్రకటించింది.
- 2015, జూన్ 5: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో హిందూయేతరల ప్రవేశంపై నిషేధం విధించారు.
- 2015, జూన్ 4: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 18 మంది జవాన్లు మరణించారు.
- 2015, జూన్ 6: తెలుగు సినీనటి ఆర్తీ అగర్వాల్ మరణం.
- 2015, జూన్ 8: కేంద్ర విజిలెన్స్ కమీషనర్‌గా కేవీ చౌదరి నియమితులైనారు.
- 2015, జూన్ 11: భారతదేశంలో సంతోషకరమైన నగరంగా చండీగఢ్ ఎంపికైంది.
- 2015, జూన్ 12: రాక్‌గార్డెన్ రూపకర్త నేక్‌చంద్ మరణం.
- 2015, జూన్ 13: భారత సంతతి వ్యక్తి హర్షద్ కుమార్ ధరంషికి బ్రిటీష్ రాణి నైట్ హుడ్ పురస్కారం లభించింది.
- 2015, జూన్ 13: ఉత్తరప్రదేశ్‌లోని ఈటా సమీపంలో ఘోర రోడ్డుప్రమాదంలో 15 మంది మరణించారు.
- 2015, జూన్ 14: కేంద్ర మంత్రిగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన షీలాకౌల్ మరణించారు.
- 2015, జూన్ 17: ఆధునిక భారత రూపశిల్పిగా పేరుపొందిన చార్లెస్ కొరియర్ మరణం.
- 2015, జూన్ 19: భారత శాస్త్రవేత్త సీఎన్ రావుకు జపాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.
- 2015, జూన్ 20: భారత్‌లో జన్మించిన నికేశ్ అరోరా జపాన్‌లోని సాహ్ట్‌బ్యాంక్ కార్పోరేషన్ అధిపతిగా నియమితులైనారు.
- 2015, జూన్ 23: మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల మరణం.
- 2015, జూన్ 25: భారత అధ్యాత్మికవేత్త రవిశంకర్‌కు కొలంబియా ప్రభుత్వం అత్యున్నత అవార్డు ప్రధానం చేసింది.
- 2015, జూన్ 25: ఫోర్బ్స్ విడుదల చేసిన "బెస్ట్ అండర్ విలియన్" జాబితాలో 11 భారతీయ సంస్థలకు చోటు దక్కింది.
- 2015, జూన్ 25: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదంలో 20 మంది మరణించారు.
- 2015, జూన్ 30: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్.నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించింది.
జూలై 2015:
- 2015, జూలై 1: 2014 సంవత్సరపు జిడి బిర్లా పురస్కారం సంజీవ్ గలండేకు ప్రకటించబడింది.
- 2015, జూలై 4: వ్యాపం కుంభకోణంలో మరణాల సంఖ్య 45కు చేరింది.
- 2015, జూలై 7: కార్మికుల దినసరి కనీస వేతనాన్ని కేంద్రం రూ.160కి పెంచింది.
- 2015, జూలై 10: ఇస్రో PSLV C28 ఉపగ్రహనౌక ద్వారా బ్రిటన్‌కు చెందిన 5 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.
- 2015, జూలై 14: దక్షిణ భారతదేశ చలనచిత్ర సంగీతదర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ మరణం.
- 2015, జూలై 14: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ళ నిషేధం విధిస్తూ లోధా లమిటి తీర్పు ఇచ్చింది.
- 2015, జూలై 27: భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఏ.పి.జె.అబ్దుల్ కలాం మరణించారు.
- 2015, జూలై 29: సంజీవ్ చతుర్వేది, అన్షు గుప్తాలకు రామన్ మెగ్సేసే అవార్డులు లభించాయి.
- 2015, జూలై 30: ముంబాయి బాంబు పేలుళ్ళ నేరస్థుడు యాకూబ్ మెమన్‌ను నాగ్పూర్‌లో ఉరితీశారు.
- 2015, జూలై 30: దేశీయ బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్‌ను ఫ్రాన్స్ బ్యాంకింగ్ సంస్థ బీఎన్‌పి పారిబస్ కొనుగోలు చేసింది.
ఆగస్టు 2015:
- 2015, ఆగస్టు 1: మణిపూర్‌లో చాండెల్ జిల్లా జౌమోల్‌లో కొండచరియలు పడి 20 మంది మరణించారు.
- 2015, ఆగస్టు 4: మధ్యప్రదేశ్‌లోని కుదువా రైల్వేస్టేషన్ సమీపంలో ఘోరరైలుప్రమాదం.
- 2015, ఆగస్టు 8: బీహార్ గవర్నరుగా శ్రీరాంనాథ్ కోవింద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా ఆచార్య దేవవ్రత్ లు నియమించబడ్డారు. (అన్ని రాష్ట్రాల గవర్నర్ల కొరకు ఇక్కడ చూడండి)
- 2015, ఆగస్టు 8: జాతీయస్థాయిలో పరిశుభ్రతలో మైసూరు ప్రథమస్థానంలో నిలిచింది.
- 2015, ఆగస్టు 10: ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబిద్ అలీ "హనుమాన్ చాలీసా"ను ఉర్దూలోకి అనువదించాడు.
- 2015, ఆగస్టు 11: జార్ఖండ్‌లో దియోగఢ్‌లోని దుర్గామాత ఆలయంలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు.
- 2015, ఆగస్టు 11: గూగుల్ సీఈఓగా భారతీయుడైన సుందర్ పిచ్చై పేరు ప్రతిపాదించబడింది.
- 2015, ఆగస్టు 15: ముకుంద్ వరదరాజన్‌కు మరణానంతరం అశోకచక్ర లభించింది.
- 2015, ఆగస్టు 20: రాజస్థాన్ పురపాలకసంఘ ఎన్నికలలో భాజపా అత్యధిక స్థానాలు పొందింది.
- 2015, ఆగస్టు 25: మతాల వారీగా జనాభా గణాంకాలను రిజిస్ట్రార్ అండ్ సెన్సెస్ కమీషనర్ విడుదల చేశారు.
- 2015, ఆగస్టు 28: ఢిల్లీలో ఔరంగాజేబు రహదారికి అబ్దుల్ కలాం రహదారిగా పేరుమార్చాలని ఢిల్లీ నగరపాలక సంస్థ నిర్ణయించింది.
- 2015, ఆగస్టు 30: కన్నడ సాహితీవేత్త, హంపి విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఎం.ఎం.కల్బుర్గి హత్యకు గురయ్యారు.
సెప్టెంబరు 2015:
- 2015, సెప్టెంబరు 4: ఒరిస్సాలోని భద్రక్ జిల్లాలోని వీలర్ ఐలాండ్ పేరును "అబ్దుల్ కలాం ఐలాండ్"గా మార్చబడింది.
- 2015, సెప్టెంబరు 4: జాతీయ హ్యుమానిటీస్ పురస్కారం-2014 ఝంపాలాహిరికి లభించింది.
- 2015, సెప్టెంబరు 6: దేశ సాంస్కృతిక గణాంక నిధి తయారీకి కేంద్రం చర్యలు చేపట్టింది. ("భారత్ కా సాంస్కృతిక్ మన్ చిత్రన్" పేరిట)
- 2015, సెప్టెంబరు 9: 2014 సంవత్సరపు గాంధీ శాంతి బహుమతిని ఇస్రోకు ప్రధానం చేశారు.
- 2015, సెప్టెంబరు 9: DRDO డైరెక్తర్ జనరల్‌గా జె.మంజుల నియమితులైనారు. (ఈ పదవి పొందిన తొలి మహిళ్)
- 2015, సెప్టెంబరు 9: బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.
- 2015, సెప్టెంబరు 9: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మెన్‌గా శశిధర్ సిన్హా నియమితులైనారు.
- 2015, సెప్టెంబరు 11: బెంగుళూరు నగరపాలక సంస్థ మేయరు స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.
- 2015.సెప్టెంబరు 16: గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని పూరించడానికి "శ్యామా ప్రసాద్ ముఖర్జీ రర్బర్" మిషన్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం.
- 2015, సెప్టెంబరు 19: టీవీ రాజేశ్వర్ రచించిన :ది క్రూషియల్ ఇయర్స్" పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.
- 2015, సెప్టెంబరు 20: బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా మరణం.
- 2015, సెప్టెంబరు 25: విలాసవంతమైన మహారాజ రైలుకు సెవెన్ స్టార్ లక్జరీ పురస్కారం లభించింది.
అక్టోబరు 2015:
- 2015, అక్టోబరు 6: INS అస్త్రధారిణి నౌక జాతికి అంకితం చేయబడింది.
ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, |
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి