ఆంధ్రప్రదేశ్ వార్తలు 2015 (Andhra Pradesh News 2015)
జనవరి 2015:
- 2015, జనవరి 2: సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లను చైతన్యపర్చినందుకు గాను ఈటీవి-ఆంధ్రప్రదేశ్, ఈటీవి-తెలంగాణ ఎన్నికల సంఘంచే పురస్కారం పొందింది.
- 2015, జనవరి 2: గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా రాంశరణ్ నియమితులైనారు.
- 2015, జనవరి 4: ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసార్ (అడుసుమిల్లి జనార్థన్ వరప్రసాద్) మరణించారు.
- 2015, జనవరి 7: అనంతపురం జిల్లా మడకశిర సమీపంలో పేటళ్ల వద్ద బస్సులోయలో పడి 15 మంది మరణించారు.
- 2015, జనవరి 12: ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణించారు.
- 2015, జనవరి 18: కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామాన్ని నారా లోకేష్ దత్తత తీసుకున్నారు.
- 2015, జనవరి 19: తిరుపతి శాసనసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది.
- 2015, జనవరి 19: కడప జిల్లాకు చెందిన కందుల సొదరులు భాజపాలో చేరారు.
- 2015, జనవరి 19: సెన్సార్ బోర్డు సభ్యురాలిగా జీవితా రాజశేఖర్ నియమించబడ్డారు.
- 2015, జనవరి 19: శాసనమండలి సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు మరణించారు.
- 2015, జనవరి 23: హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ మరణించారు.
- 2015, జనవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ లభించింది.
- 2015, జనవరి 31: గుంటూరు జిల్లా తెనాలిలో లక్షా 28 వేల 913 మంది ఒకే సారి హనుమాన్ చాలీసా పారాయణం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
ఫిబ్రవరి 2015:
- 2015, ఫిబ్రవరి 2: పాతతరం నటుడు పీసపాటి వెంకటేశ్వరరావు మరణించారు.
- 2015, ఫిబ్రవరి 5: సినీ నిర్మాట అట్లూరి రామారావు మరణించారు.
- 2015, ఫిబ్రవరి 7: రంజీట్రోఫి మ్యాచ్‌లో ఆంధ్రాకు చెందిన కే.ఎన్.భగత్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
- 2015, ఫిబ్రవరి 8: సీపీఎం 24వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
- 2015, ఫిబ్రవరి 13: ప్రముఖ నవలా రచయిత కేశవరెడ్డి మరణించారు.
- 2015, ఫిబ్రవరి 16: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుగుణమ్మ విజయం సాధించింది.
- 2015, ఫిబ్రవరి 18: ప్రముఖ చలనచిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించారు.
- 2015, ఫిబ్రవరి 19: రాష్ట మంత్రిగా పనిచేసిన సోమశేఖర్ మరణించారు.
- 2015, ఫిబ్రవరి 19: విశాఖపట్టణానికి చెందిన మహిళా కార్టూనిస్టు రాగతి పండరి మరణించారు.
- 2015, ఫిబ్రవరు 21: 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
మార్చి 2015:
- 2015, మార్చి 2: స్వాతంత్ర్య సమరయోధుడు, ముద్రణారంగ ప్రముఖుడు పరచూరి హన్మంతరావు మరణించారు.
- 2015, మార్చి 5: అత్యధిక ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ లిమ్కా రికార్డు సృష్టించింది.
- 2015, మార్చి 15: సాహితీవేత్త రాళ్లబండి వెంకట ప్రసాదరాజ్ మరణించారు.
- 2015, మార్చి 29: పట్టిసీమ ఎత్తిపోతల పథకంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
ఏప్రిల్ 2015:
- 2015, ఏప్రిల్ 1: కడప జిల్లాకు చెందిన రచయిత శశిశ్రీ మరణం.
- 2015, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరును అమరావతిగా రాష్ట్ర కేబినెట్ ఖరారుచేసింది.
- 2015, ఏప్రిల్ 3: చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటిలో పెప్సికో ప్లాంటు ప్రారంభించబడింది.
- 2015, ఏప్రిల్ 4: పర్వతారోహకుడు మస్తాబ్ బాబు మరణించాడు.
- 2015, ఏప్రిల్ 8: రాష్ట్ర మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మరణించారు.
- 2015, ఏప్రిల్ 9: ప్రముఖ హిందీ అష్టావధాని చేబ్రోలు శేషగిరిరావు మరణించారు.
- 2015, ఏప్రిల్ 10: ఆప్కాబ్ చైర్మెన్‌గా పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
- 2015, ఏప్రిల్ 17: మా (సినీ కళాకారుల సంఘం) ఎన్నికలలో అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.
- 2015, ఏప్రిల్ 19: సంగీత దర్శకుడు శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) మరణించారు.
- 2015, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన కూనవరం, చింతూరు, రామచంద్రాపురం, వర రామచంద్రాపురం మండలాలను రంపచోడవరం నియోజకవర్గం లోనికి, కుక్కునూరు, వేలూరుపాడు మండలాలను పోలవరం నియోజకవర్గంలోకి చేరుస్తూ కేంద్రం గెజిట్ విడుదలచేసింది.
- 2015, ఏప్రిల్ 23: కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరుకు చెందిన కలంకారీ హస్తకళాకారుడు కె.శివప్రసాద్ రెడ్డికి 2012 సం.పు జాతీయస్థాయి ఉత్తమ కళాకారుడు పురస్కారం లభించింది.
- 2015, ఏప్రిల్ 27: సాహితీవేత్త యు.ఏ.నర్సింగమూర్తి మరణం.
- 2015, ఏప్రిల్ 28: చేతుల పరిశుభ్రత కార్యక్రమంలో సత్తెనపల్లి మార్కెట్ యార్డు గిన్నిస్ రికార్డు సృష్టించింది.
- 2015, ఏప్రిల్ 27: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా చదలవాడ కృష్ణమూర్తి నియమించబడ్డారు.
మే 2015:
- 2015, మే 7: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే నియమితులైనారు.
- 2015, మే 13: ఆర్టీసి సిబ్బంది సమ్మె విరమణ. తెలంగాణలో 44%, ఆంధ్రప్రదేశ్‌లో 43% ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వాలు అంగీకారం.
- 2015, మే 23: విద్యావేత్త గుడిమెట్ల సుబ్బారెడ్డి మరణం.
- 2015, మే 24: సినీ సంగీత దర్శకుడు ఆకాశపు ఆదినారాయణ మరణించారు.
- 2015, మే 27: "డ్రన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్" రూపొందించిన అత్యుత్తమ భారతీయ కంపెనీల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 21 కంపెనీలు స్థానం పొందాయి.
- 2015, మే 28: నవలా రచయిత్రి పవని నిర్మల ప్రభావతి మరణం.
- 2015, మే 28: స్వాతంత్ర్యం నుంచి క్రమం తప్పకుండా ఓటుహక్కు వినియోగిస్తున్న అరుదైన ఓటరు కర్నాటి వెంకటరెడ్డి మరణం.
జూన్ 2015:
- 2015, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూమిపూజ జరిగింది.
- 2015, జూన్ 8: కృష్ణా జిల్లాకు చెందిన కేవీ చౌదరి కేంద్ర విజిలెన్స్ కమీషనర్‌గా నియమితులైనారు.
- 2015, జూన్ 13: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి వాహనం బోల్టాపడి 23+ మరణించారు.
జూలై 2015:
- 2015, జూలై 3: భాజపా జాతీయ మహిళా మోర్చా ఇంచార్జిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమించబడ్డారు.
- 2015, జూలై 6: స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు భాట్టం శ్రీరామమూర్తి మరణం.
- 2015, జూలై 10: ప్రేక్షకులు ఎదురుచూస్తున్న "బాహుబలి" సినిమా విడుదలైంది.
- 2015, జూలై 14: గోదావరి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
- 2015, జూలై 14: రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 23 మంది మరణించారు.
- 2015, జూలై 16: సినిమా పాటల గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మరణం.
- 2015, జూలై 19: తెలుగు ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు.
- 2015, జూలై 22: బాహుబలు సినిమా పోస్టర్ అతిపెద్ద పోస్తర్‌గా గిన్నిస్ రికార్డు సాధించింది.
- 2015, జూలై 25: కవి చలనాని ప్రసాద్ మరణం.
- 2015, జూలై 28: ప్రముఖ హేతువాది ఎన్వీ బ్రహ్మం మరణం.
ఆగస్టు 2015:
- 2015, ఆగస్టు 14: నాస్తికోద్యమ నాయకుడు గోపరాజు లవణం మరణం.
- 2015, ఆగస్టు 27: ఆకర్షణీయ నగరాల ప్రాథమిక జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ ఎంపికయ్యాయి.
సెప్టెంబరు 2015:
- 2015, సెప్టెంబరు 9: స్వాతంత్ర్య సమరయోధుడు త్రిపురాన రాఘవదాసు మరణం.
- 2015.సెప్టెంబరు 16: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలు కృష్ణాలో కలిపే కార్యక్రమానికి ముఖ్యమంత్రి పైలాన్ ఆవిష్కరించారు.
- 2015, సెప్టెంబరు 22: పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవులు) నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 2 స్థానాలలో విజయం సాధించింది.
- 2015, సెప్టెంబరు 22: జగ్గయ్యపేటను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువచ్చారు.
అక్టోబరు 2015:
- 2015, అక్టోబరు 4: నిర్మాత ఏడిద కామేశ్వరరావు మరణించారు.
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, |
|
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
రిప్లయితొలగించండిsir i want 2016 current affirs in ap
రిప్లయితొలగించండిplz upload
ఇదివరకు రోజూ చేర్చేవాళ్ళము. సమయాభావం వల్ల ఆ పని కుంటుపడింది. సమయం లభించినప్పుడు చేర్చడానికి ప్రయత్నిస్తాము.
తొలగించండి