హన్మకొండ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉంది. వరంగల్ మరియు కాజీపేటలతో కలిసి ఇది ట్రైసిటిగా పిలువబడుతుంది. ఈ మండలం కాజిపేట మరియు వరంగల్ మధ్యలో హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారిపై ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాలగుడి, భద్రకాళి దేవాలయం హన్మకొండలో ఉన్నాయి.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలను వరంగల్ మండలంలోకి, 9 రెవెన్యూ గ్రామాలను కాజీపేట మండలంలోకి, 2 రెవెన్యూ గ్రామాలను ఐనవోలు మండలానికి తరలించారు.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు పశ్చిమాన హసన్‌పర్తి మండలం, తూర్పున వరంగల్ మండలం, దక్షిణాన కాజీపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 433561. ఇందులో పురుషులు 217929, మహిళలు 215632. మండలంలో పట్టణ జనాభా 398651, గ్రామీణ జనాభా 34910. అక్షరాస్యత శాతం 83.85%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో ప్రథమ స్థానంలో ఉంది.
రాజకీయాలు:
ఈ మండలము వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రవాణా సౌకర్యాలు: తెలంగాణలో ప్రముఖ రైల్వేజంక్షన్‌లలో కాజీపేట ఒకటి. ఇక్కడి నుంచి హైదరాబాదు, డిల్లీ, విజయవాడలకు రైలుమార్గాలున్నాయి. ఈ మండలం కాజిపేట మరియు వరంగల్ మధ్యలో హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారిపై ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
హన్మకొండ (Hanamkonda), కుమర్‌పల్లి (Kumarpalle), పలివెల్పుల (Palivelpula), లష్కర్‌సింగారం (Lashkarsingaram), గోపాల్‌పూర్ (Gopalpur), వడ్డేపలి (Waddepally)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
హన్మకొండ (Hanmakonda): హన్మకొండ వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన పట్టణము. వరంగల్ మరియు కాజీపేటలతో కలిసి ఇది ట్రైసిటిగా పిలువబదుతుంది. ప్రఖ్యాతిచెందిన కాకతీయుల కాలం నాటి వేయిస్తంబాల గుడి, భద్రకాళి ఆలయం పట్టణంలో ఉన్నాయి. ఈ పట్టణం మొత్తం గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉంది. జాతీయ రహదారి నెంబర్ 202 పట్టణం మీదుగా వెళ్ళుచున్నది. రాష్ట్రమంత్రిగా పనిచేసిన కొండా సురేఖ 1965లో హన్మకొండలో జన్మించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bheemadevarpalli Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి