భీమదేవరపల్లి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రధానమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ మండలమునకు చెందినవారు. ముత్తారంలో కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. ఈ మండలము హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండల పరిధిలోని ముల్కనూరు సహకార బ్యాంకు దేశంలోనే ఆదర్శంగా నిలిచింది.
2016 జిల్లాల పునర్విభజనకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న వరంగల్ పట్టణ జిల్లాలో భాగమైంది. అదేసమయంలో ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిషిలోకి వచ్చింది..
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఎల్కతుర్తి మండలం, దక్షిణాన వేలేరు మండలం, ఉత్తరాన కరీంనగర్ జిల్లా, పశ్చిమాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55595. ఇందులో పురుషులు 27492, మహిళలు 28103. అక్షరాస్యుల సంఖ్య 31759.
రాజకీయాలు:
ఈ మండలము హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన జక్కుల అనిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన వంగా రవి విజయం సాధించారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Vangara, Bheemadevarpalle, Ratnagiri, Manikyapur, Koppur, Kothapalle, Mulkanoor, Mutharam (P.K), Gatlanarsingapur, Kothakonda, Mallaram, Musthafpur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొత్తకొండ (Kothakonda): కొత్తకొండ వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ శ్రీవీరభద్రస్వామి దేవాలయం ఉంది. ముత్తారం (Muttaram): ముత్తారం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని పోలిఉంటుంది. ముల్కనూరు (Mulkanur): ముల్కనూరు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. మహిళా సహకార డెయిరీ వల్ల గ్రామం ప్రసిద్ధి చెందింది.2012లో ముల్కనూరు డెయిరీ దేశంలోనే ఉత్తమ డెయిరీగా ఎంపికైంది. వంగర (Vangara): వంగర వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. భారతదేశ ప్రధానమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ గ్రామమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bheemadevarpalli Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి