కడ్తాల్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. అంతకు క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఆమనగల్ మరియు తలకొండపల్లి మండలాల నుంచి 16 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఇది కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది.నంది అవార్డు గహీత బులెమోని వెంకటేశ్వర్లు ఈ మండలానికి చెందినవారు. ఆసియాలో అతిపెద్ద ధ్యానపిరమిడ్ మండలకేంద్రంలో ఉంది.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కందుకూర్ మండలం, ఈశాన్యాన మరియు తూర్పున యాచారం మండలం, ఆగ్నేయాన మాడ్గుల్ మండలం, దక్షిణాన ఆమనగల్ మండలం, నైరుతిన తలకొండపల్లి మండలం, పశ్చిమాన కేశంపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: చెల్లంపల్లి (Chellampalle), చారకొండ (Cherikonda), ఎక్రాజ్‌గూడ (Ekrajguda), కడ్తాల్ (Kadthal), కాకర్లపహాడ్ (Karkalpahad), మక్తమాధారం (Makthamadharam), ముద్విన్ (Mudwin), నాగిరెడ్డిగూడ (Nagireddiguda), న్యామతాపూర్ (Nyamathapur), పట్టికల్వకుర్తి (Pattikalwakurthy), పట్టిపడకల్ (Pattipadkal), రావిచేడు (Ravichedu), సలార్‌పుర్ (Salarpur), తక్రాజ్‌గూడ (Takrajguda), వంపుగూడ (Vampuguda), వాసుదేవపూర్ (Vasudevapur)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి