ఘన్‌పూర్ వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 18 రెవెన్యూ గ్రామాలు, 27 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49055. భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. మండల కేంద్రంలో గణపతిదేవుని కాలంలో మల్యాల గుండన నిర్మించిన గణపసముద్రం అనే చెరువు ఉంది. ప్రముఖ సెపక్‌తక్రా క్రీడాకారిణి నవత ఈ మండలానికి చెందినది.
భౌగోళికం, సరిహద్దులు: మండలం మొత్తం విస్తీర్ణం 18721 హెక్టార్లు. ఇందులో 2645 హెక్టార్ల అడవులు ఉన్నాయి (14%). ఈ మండలానికి తూర్పున బిజినేపల్లి మండలం, దక్షిణాన పెద్దమందడి మండలం, ఆగ్నేయాన కొంతభాగం గోపాలపేట, వనపర్తి మండలాలు, పశ్చిమాన అడ్డాకల్ మండలం, ఉత్తరాన భూత్పూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42049. ఇందులో పురుషులు 21356, మహిళలు 20693. ఎస్సీల సంఖ్య 6353, ఎస్టీల సంఖ్య 6102. జనసాంద్రత 228/చకిమీ, స్త్రీపురుష నిష్పత్తి 967. అక్షరాస్యత శాతం 39.93%. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49055. ఇందులో పురుషులు 25172, మహిళలు 23883. జనాభాలో ఇది జిల్లాలో 52వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: మండలానికి పశ్చిమం నుంచి జాతీయ రహదారి వెళ్ళుచున్ననూ ఈ మండలానికి సరైన రవాణా సదుపాయం లేదు. మహబూబ్ నగర్ శ్రీశైలం రహదారి నుంచి మండల కేంద్రానికి రోడ్డుసౌకర్యం ఉంది.
ఈ మండలము వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సోమ్లి ఎన్నికయ్యారు.2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 19 గ్రామపంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 10, తెలుగుదేశం పార్టీ 9 పంచాయతీలలో విజయం సాధించాయి. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 39 పాథమిక పాఠశాలలు (37 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 8 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 6 జడ్పీ), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 18721 హెక్టార్లలో 29% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 14% భూమి అటవీ ప్రాంతంగా ఉంది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 607 మిమీ. మండలంలో సుమారు 2500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
ఘన్‌పూర్ మండలం (Ghanpur Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి