5, జులై 2014, శనివారం

Home

పాలమూరు జిల్లా విజ్ఞానసర్వస్వము పాఠకులకు స్వాగతం. ఏప్రిల్ 12, 2013న విజయ ఉగాది పర్వదినం నాడు ప్రారంభించిన ఈ విజ్ఞానసర్వస్వము బ్లాగులో ఇప్పటివరకు 3200 కు పైగా వ్యాసాలు చేర్చబడినవి. ఇందులో పాలమూరు జిల్లాకు చెందిన 2150 వ్యాసాలే కాకుండా 1050 ఇతర వ్యాసాలు కూడా ఉన్నాయి. పాలమూరు జిల్లాకు చెందిన గ్రామాలతో సహా మొత్తం 3,000 వ్యాసాలను చేర్చుతూ ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు చెందిన ముఖ్యమైన వ్యాసాలను కూడా జతపరుస్తూ 5000 వ్యాసాలతో సమగ్ర విజ్ఞానసర్వస్వాన్ని తయరు చేసే లక్ష్యంతో రూపొందుతున్న ఈ బ్లాగును ఆదరిస్తారని, మరింత సమాచారం చేర్చడానికి మీ వంతు సహాయపడతారని ఆశిస్తున్నాము.
కొత్త వ్యాసాలు
  రాజోలి, మానవపాడు, పల్లెపాడు, ఆలంపూర్, గొందిమల్ల, మల్డకల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు, అమరచింత, చల్లా రాంభూపాల్ రెడ్డి, కార్వంగ, టెలకపల్లి, ఉప్పునూతల, బిజినేపల్లి, వెలుగొండ, పాలెం, వట్టెంఉట్కూరు, భూత్పూర్, తిమ్మాపూర్, దామరగిద్దకానుకుర్తి, కోడంగల్, రుద్రారం, పోలెపల్లి, ముశ్రిఫా, కోస్గి, గంగాపూర్, వలిపె రాంగోపాలరావు, వింజమూర్, కొందుర్గ్, ఇప్పటూరు, కారుకొండ

జిల్లేడు సంస్థానాధీశుల కాలం నాటి కోట
మీకు తెలుసా?
  • రాష్ట్రంలో తొలి పంచాయతి సమితి షాద్‌నగర్ ఈ జిల్లాకు చెందినది.
  • తెలంగాణలో ఏకైక శక్తిపీఠం ఉన్న క్షేత్రం ఆలంపూర్ ఈ జిల్లాలోనే ఉంది.
  • భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాందిగా పరిగణించే వేదిక మాధవరావుపల్లి ఈ జిల్లాలోనిదే.
  • తొలి తెలుగు రామాయణం "రంగనాథ రామాయణం" రచించిన గోనబుద్ధారెడ్డి మనవాడే.
  • ఆసియాలో అతిపెద్ద ధ్యానమందిరం ఉన్న ప్రాంతం కడ్తాల్ ఈ జిల్లాకు చెందినదే.
  • దేశంలోనే మొదటి జీవవైవిధ్య మండలి ఏర్పాటుచేసిన అమరచింత గ్రామం పాలమూరు జిల్లాకు చెందినదే.
సంఘటనలు
  • 2014, ఆగస్టు 20: మాగనూరు వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ఏడుగురు మరణించారు.
  • 2014, జూలై 3: పురపాలక సంఘాల చైర్మెన్ల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5, తెరాస, భాజపా, తెదేపా ఒక్కో స్థానం సాధించాయి.
  • 2014, జూన్ 13: ఫిడే (అంతర్జాతీయ చదరంగం సమాఖ్యా) రేటింగ్‌లో తొలిసారి జిల్లాకు చెందిన కుమారి శ్రేష్ఠకు స్థానం లభించింది.
  • 2014,  మే 17: శాసనసభ స్థానాలలో తెరాస 7 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 5, తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు పొందాయి. లోకసభలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానం పొందాయి.
  • 2014, మే 14: మక్తల్ మాజీ ఎమ్మెల్యే నరసింహులు నాయుడు మరణించారు.
  • 2014, ఏప్రిల్ 22: భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి యొక్క భారీ బహిరంగ సభ జరిగింది.
(మరిన్ని సంఘటనలకై పాలమూరు జిల్లా కాలరేఖ చూడండి) 

పాలమూరు జిల్లా వింతలు, విశేషాలు:
  • అది ఒక చారిత్రాత్మక అధ్యాత్మిక క్షేత్రం. స్వయంభువుగా వెల్సిన శ్రీవెంకటేశ్వరస్వామి దివ్యధామం. ఆ గ్రామంలో ఎవరూ రెండో అంతస్తు కట్టకపోవడం ఆచారంగా వస్తోంది. ఎందుకు?, అదెక్కడా? (మల్డకల్ వ్యాసం చదవండి).
  • అదొక క్రీస్తు పూర్వపు ప్రాచీన యుగ కాలం నాటి వింత. అక్కడ విశాలమైన ప్రదేశంలో ఎన్నో నిలువురాళ్ళు. వాటిని ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది! ఎందరో చరిత్రకారులు, విదేశీ పరిశోధకులు పరిశీలించిననూ ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన ఆ ప్రాంతం ఏది? (మడుమాల్ వ్యాసం చదవండి).
  • అది చిన్న గ్రామం. అక్కడ ఉందొక ప్రాచీన దేవాలయం. రెండు వందల సంవత్సరాలకు పైగా నిరాటంకంగా జ్యోతి వెలుగుందుతూనే ఉంది. ఎవరు వెలిగించారు? ఎందుకు?  (మున్ననూర్ దేవాలయం వ్యాసం చదవండి).
  • అది ఒక సాధారణ గ్రామం. అనతికాలంలోనే ప్రగతిపథంలో దూసుకుపోయింది. మండల కేంద్రం కూడా కాదు కాని అక్కడ 2 డిగ్రీ కళాశాలలున్నాయి, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది, ప్రాచ్యకళాశాల ఉంది, దేశవిదేశాల నుంచి అతిథులు సందర్శించారు, సుందరమైన దేవాలయాలున్నాయి, పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వీటన్నింటికీ కారకుడు ఒకే వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఎవరు? అతని ఘనకార్యాలేమిటి? (పాలెం వ్యాసం చదవండి).
  • అపరభద్రాద్రిగా పేరుపొందిన రామాలయం అది. భద్రాచలంలోనే ప్రతిష్టించాల్సిన విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టించబడ్డాయట! ఎందుకు? అదెక్కడా? (సిర్సనగండ్ల సీతారామాలయం వ్యాసం చదవండి). 
  • రెండోసారి ఎన్నికైతే వాహ్ అంటాం, మూడోసారి ఎన్నికైతే అబ్బో అంటాం, నాలుగోసారి ఎన్నికైతే గ్రేట్ అంటాం, వరసగా 8వ సారి ఎన్నికైతే ...? వరుసగా 42 సంవత్సరాలు సర్పంచిగా పాలించిన ఆ వ్యక్తి ఎవరు? (అమిస్తాపూర్ వ్యాసం చదవండి)
  • కాకతీయుల కాలంలో ఇది కాకతీయుల కంటే పెద్ద రాజ్యానికి రాజధాని. ఎంతో వైభవంగా వెలుగొందిన ప్రాంతమిది. అంతకు ముందు పెద్ద జైనక్షేత్రం. జైన తీర్థంకరుడి పేరిటే ఉన్న ఈ రాజధానిపై కాకతీయ రుద్రదేవుడు దండెత్తి సర్వనాశనం చేసి గాడిదలతో దున్నించి వెళ్ళాడు. ఎందుకు? ఆ రాజధాని ఏది? (చదవండి వర్థమానపురం వ్యాసం). 
  • ఇంటర్మీడీయట్ పూర్తయిన పిదప పై చదువు చదవడానికి ఆర్థిక స్తోమత లేకుండా ఒక బట్టల షాపులో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి నేడు వస్త్ర వ్యాపారంలో 2000 కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే అగ్రగామిగా అవతరించిన ఆవ్యక్తి ఎవరు (తిమ్మాజీపేట వ్యాసం చదవండి)
(మరిన్ని విశేషాలకై ఇక్కడ చూడండి)
వార్తాపత్రికలు- జిల్లా ఎడిషన్ లింకులు
ఇతర జిల్లా విభాగాల లింకులు

అనంతపురం జిల్లా, ఆదిలాబాదు జిల్లా, కడప జిల్లా, కరీంనగర్ జిల్లా, కర్నూలు జిల్లా, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, నల్గొండ జిల్లా, నిజామాబాదు జిల్లా, నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లాహైదరాబాదు జిల్లా,
= = = = =






2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక