2, జనవరి 2014, గురువారం

క్రీడా వార్తలు 2014 (Sports News 2014)

క్రీడా వార్తలు 2014 (Sports News 2014)
ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2014ఆంధ్రప్రదేశ్ వార్తలు-2014జాతీయ వార్తలు-2014అంతర్జాతీయ వార్తలు-2014

జనవరి 2014:
  • 2014, జనవరి 1: న్యూజీలాండ్‌కు చెందిన కోరె అండర్సన్ 36 బంతుల్లోనే శతకం సాధించి వన్డే క్రికెట్ పోటీలలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 
  • 2014, జనవరి 4: ఆసియా కప్ అండర్-19 వన్డే క్రికెట్ టోర్నమెంటును భారత్ కైవసం చేసుకుంది. 
  • 2014, జనవరి 5: చెన్నై ఓపెన్ టైటిల్‌ను టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా గెలుచుకున్నాడు.
  • 2014, జనవరి 7: జాతీయస్థాయి పైకా పోటీలు మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రారంభమయ్యాయి.  
  • 2014, జనవరి 9: మహబుబ్‌నగర్‌లో జరుగుతున్న పైకా జాతీయ పోటీలలో హాజీబాబా రాష్ట్రానికి తొలి స్వర్ణం అందించాడు. 
  • 2014, జనవరి 11:కపిల్‌దేవ్‌కు బీసిసిఐ సీకెనాయుడు జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 
  • 2014, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాతేత్ మైనేని డేవిస్ కప్ లో చోటు సంపాదించాడు.
  • 2014, జనవరి 12: నేషన్స్ కప్ బాక్సింగ్ చాంప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నిఖిత్ జరీన్ 51 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 
  • 2014, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నీలో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. 
  • 2014, జనవరి 14: హైదరాబాదుకు చెందిన ఫాస్ట్ బౌలర్ అండర్-19 ప్రపంచకప్ క్రికెట్‌లో పాల్గొనే భారతజట్టులో స్థానం పొందాడు. 
  • 2014, జనవరి 15: 2005లో మొనకోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో రెండోస్థానం పొందిన లాంగ్ జంపర్ అంజూ జార్జికి తొమ్మిదేళ్ళ అనంతరం విజేతగా ప్రకటించి స్వర్ణపతకం అందించారు. 
  • 2014, జనవరి 15: ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2013 అవార్డును పోర్చుగల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోకు ప్రకటించారు. 
  • 2014, జనవరి 18: జాతీయ గ్రాస్ కోర్ట్ టెన్నిస్ చాంప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు అశ్విన్ పురుషుల డబుల్స్‌లో, భువన జోడి మహిళల డబుల్స్‌లో టైటిళ్ళు సాధించారు.
  • 2014, జనవరి 18:హాకీ వరల్డ్ లీగ్ టైటిల్‌ను నెదర్లాండ్స్ జట్టు గెలుచుకుంది. ఫైనల్లో న్యూజీలాండ్‌పై విజయం సాధించింది. 
  • 2014, జనవరి 25: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చైనాకు చెందిన లి నా గెలుచుకుంది. 
  • 2014, జనవరి 26: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్టానిస్లాస్ వావ్రింకా గెలుచుకున్నాడు- ఫైనల్లో రఫెల్ నాదల్‌పై విజయం. 
ఫిబ్రవరి 2014:
  • 2014, ఫిబ్రవరి 2: రంజీట్రోఫిని కర్ణాటక జట్టు గెలుచుకుంది. ఫైనల్లో మహారాష్ట్రపై విజయం.
  • 2014, జనవరి 5: శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర టెస్టులలో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 
  • 2014, ఫిబ్రవరి 7: రష్యాలోని సోచిలో వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. 
  • 2014, ఫిబ్రవరి 8: ఐసిసి చైర్మెన్‌గా ఎన్.శ్రీనివాసన్ ఎన్నికయ్యారు. 
  • 2014, ఫిబ్రవరి 9: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్.రామచంద్రన్ ఎన్నికయ్యారు. 
  • 2014, ఫిబ్రవరి 12: ఐపీఎల్ వేలంగా యువరాజ్ సింగ్ అత్యధికంగా రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు. 
  • 2014, ఫిబ్రవరి 12: ఇరానీ కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. 
  • 2014, ఫిబ్రవరి 18: టెస్టులలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి న్యూజీలాండ్ క్రికెటర్‌గా మెక్ కలమ్‌ రికార్డు సృష్టించాడు.
  • 2014, ఫిబ్రవరి 21: మహిళల టి-20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారతజట్టు కెప్టెన్‌గా మిథాలీరాజ్ ఎంపికయ్యారు. 

మార్చి 2014:
  • 2014, మార్చి 1: అండర్-19 ప్రపంచ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. 
  • 2014, మార్చి 7: జాతీయ స్నూకర్ టైటిల్‌ను పంకజ్ అద్వానీ ఆరవసారి గెలుచుకున్నాడు.
  • 2014, మార్చి 8: ఆసియా కప్ క్రికెట్-2014ను శ్రీలంక గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించింది.
  • 2014, మార్చి 9: జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను మిజోరాం జట్టు గెలుచుకుంది. 
  • 2014, మార్చి 9: ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పూజ ఘట్కర్ స్వర్ణపతకం సాధించింది.
  • 2014, మార్చి 16: విజయ్ హజారే ట్రోఫి కర్ణాటక గెలుచుకుంది. 
  • 2014, మార్చి 23; మహిళల టి-20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ బంగ్లాదేశ్‌లో ప్రారంభమైంది. 
  • 2014, మార్చి 28: బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు సునీల్ గవాస్కర్‌ను నియమించింది. 
ఏప్రిల్ 2014:
  • 2014, ఏప్రిల్ 6: ట్వంటి-20 ప్రపంచకప్ క్రికెట్‌ను శ్రీలంక జట్టు గెలుచుకుంది. 
  • 2014, ఏప్రిల్ 6: మహిళల టి-20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. 
  • 2014, ఏప్రిల్ 7: భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ ప్రపంచ షూటింగ్ ర్యాంకింగ్‌లో తొలి స్థానానికి చేరింది.
  • 2014, ఏప్రిల్ 12: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ పురుషుల ట్రాప్ విభాగంలో భారత్‌కు చెందిన మానవ్‌జిత్ సింగ్ సంధుకు స్వర్ణపతకం లభించింది. 
  • 2014, ఏఫ్రిల్ 14: దేశవాళీ టి-20 టోర్నమెంటును బరోడా జట్టు గెలుచుకుంది. 
  • 2014, ఏప్రిల్ 17: 2019 ఆసియా క్రీడల నిర్వహణ నుంచి వియత్నాం తప్పుకుంది.
  • 2014, ఏప్రిల్ 22: ప్రపంచ మహిళల సీనియర్ స్నూకర్ టైటిల్‌ను చిత్ర మగిమైరాజ్ గెలుచుకుంది.
  • 2014, ఏప్రిల్ 23: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో తెలుగు వ్యక్తి కాకర శ్యాంకుమార్ కాంస్యపతకం సాధించాడు. 
  • 2014 ఏప్రిల్ 26: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధుకు కాంస్యపతకం లభించింది.
  • 2014, ఏప్రిల్ 29: వింబుల్డన్ ప్రైజ్ మనీని 10.8% పెంచారు. 
మే 2014:
  • 2014, మే 10: అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించాడు.
  • 2014, మే 23: ఉబెర్ కప్‌లో భారత్ కాంస్యం సాధించింది.
  • 2014, మే 24: ఉబెర్ కప్ ఫైనల్లో చైనా జపాన్‌ను ఓడించింది. 
  • 2014, మే 24: ఐపీఎల్‌లో వేగవంతమైన అర్థశతకం చేసిన వాడిగా యూసుఫ్ పఠాన్ రికార్డు సృష్టించాడు. 
  • 2014, మే 29: మలేషియా హాకీ ప్రముఖుడు అజ్లాన్ షా మరణించాడు. 

జూన్ 2014:
  • 2014, జూన్ 2: ఐపీఎల్-7 లో కోల్‌కత నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది.
  • 2014, జూన్ 2: సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును విరాట్ కోహ్లి గెలుచుకున్నాడు.
  • 2014, జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా గెలుచుకుంది. 
  • 2014, జూన్ 8: ఫ్రెంచి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. 
  • 2014, జూన్ 10: కొరియా జాతీయ కబడ్డి జట్టు కోచ్‌గాతెలుగు వ్యక్తి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి నియమితులైనారు.
  • 2014, జూన్ 12: ప్రపంచకప్ ఫుట్‌బాల్ (ఫిఫా కప్) బ్రెజిల్‌లో ప్రారంభమైంది. 
  • 2014, జూన్ 14: ప్రపంచకప్ హాకీ మహిళల టైటిల్‌ను నెదర్లాండ్స్ గెలుచుకుంది.
  • 2014, జూన్ 14: ప్రపంచకప్ హాకీ-2014లో భారత జట్టు 9వ స్థానం పొందింది. 
  • 2014, జూన్ 16: ప్రపంచకప్ సాకర్ టోర్నీలో జర్మనీకి ఆటగాడు థామస్ ముల్లర్ హాట్రిక్ సాధించాడు. 
  • 2014, జూన్ 17: బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే క్రికెట్ పోటీలో భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ 4.2 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు.
  • 2014, జూన్ 19: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ స్వర్ణం సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్‌కు కాంస్యం లభించింది. 
  • 2014, జూన్ 26: ఉరుగ్వే ఫుట్‌బాల్ ఆటగాడు సురెజ్‌పై ఫిఫా 9 మ్యాచ్‌ల నిషేధం విధించింది. 
  • 2014, జూన్ 26: జనవరి 2014లో 35వ జాతీయ క్రీడలు కేరళలో జరుగుతాయని ఐఓఏ ప్రకటించింది. 
  • 2014, జూన్ 26: ఐసిసి చైర్మెన్‌గా శ్రీనివాసన్ నియమితులైనారు. 
  • 2014, జూన్ 29: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్ చాంప్‌ను సైనా నెహ్వాల్ గెలుచుకుంది. 
  • 2014, జూన్ 29: IBSF ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను భారతీయ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు.
    జూలై 2014:
  • 2014, జూలై 5: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా గెలుచుకుంది.
  • 2014, జూలై 6: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. 
  • 2014, జూలై 13: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను జర్మనీ జట్టు గెలుచుకుంది.
  • ఆగస్టు 2014:
  • 2014, ఆగస్టు 14: చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారిగా పతకం సాధించింది.
  • 2014, ఆగస్టు 14: నార్వేలో జరిగిన చెస్ ఒలింపియాడ్ టోర్నీలో పురుషుల విభాగంలో చైనా, హంగేరీ, భారత్ మరియు మహిళల విభాగంలో రష్యా, చైనా, ఉక్రేయిన్‌లు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాయి.
  • 2014, ఆగస్టు 31: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ (పు) టైటిల్ చైనాకు చెందిన లాంగ్ చెన్, మహిళల టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన కరోలినా మరిన్ సాధించారు.
  • 2014, ఆగస్టు 31: ప్రొ కబడ్డి లీగ్ తొలి చాంపియన్‌షిప్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ గెలుచుకుంది. ఫైనల్లో యు ముంబపై విజయం సాధించింది. 
సెప్టెంబరు 2014:
  •  2014, సెప్టెంబరు 2: అత్యధిక వన్డే విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోని అవతరించాడు.
  • 2014, సెప్టెంబరు 2: అత్యధిక కాలం జీవించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్ నార్మన్ గోర్డాన్ మరణించారు. 
  • 2014, సెప్టెంబరు 6: సానియామీర్జా అమెరికన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించింది. 
  • 2014, సెప్టెంబరు 8: అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్‌ను రష్యాకు చెందిన ఎక్తరీనా మకరోవా, ఎలినా వెస్నినా జోడి గెలుచుకుంది. 
  • 2014, సెప్టెంబరు 8: గ్రాండ్‌స్లాం టోర్నీలో ఫైనల్ చేరిన తొలి ఆసియా ఆటగాడిగా జపాన్‌కు చెందిన నిషికోరి అవతరించాడు. 
  • 2014, సెప్టెంబరు 8: అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. ఫైనల్లో కరోలిన్ వోజ్నియాపై విజయం సాధించింది. 
  • 2014, సెప్టెంబరు 8: అమెరికన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను అమెరికాకు చెందిన బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్ గెలుచుకున్నారు. 
  • 2014, సెప్టెంబరు 9: అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్‌ను క్రోయేషియాకు చెందిన మారిన్ సొలిక్ గెలుచుకున్నాడు.
  • 2014, సెప్టెంబరు 9: పాకిస్తాన్‌కు చెందిన స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై ఐసిసి నిషేధం విధించింది. 
  • 2014, సెప్టెంబరు 19: ఇంచియాన్‌లో ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. 
  • 2014, సెప్టెంబరు 20: ఆసియా క్రీడలలో తొలి స్వర్ణాన్ని చైనా సాధించింది.
  • 2014, సెప్టెంబరు 20: ఆసియా క్రీడలలో భారత్‌కు తొలి పతకాన్ని శ్వేతా చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అందించింది. 
  • 2014, సెప్టెంబరు 22: టీ-20 క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన తొలి బారతీయుడిగా సురేష్ రైనా అవతరించాడు. 
  • 2014, సెప్టెంబరు 25: కపిల్‌దేవ్‌కు జీవిత సాఫల్య పురస్కారంచే సత్కరించారు. 
అక్టోబరు 2014:
  •  2014, అక్టోబరు 1: మేరీ కోమ్‌ ఆసియా క్రీడల బాక్సింగ్‌లో స్వర్ణం సాధించింది.
  • 2014, అక్టోబరు 2: ఆసియా క్రీడల హాకీలో భారత్ స్వర్ణపతకం సాధించింది. 
  • 2014, అక్టోబరు 3: ఆసియాక్రీడల కబడ్డీలో మహిళల మరియు పురుషుల విభాగాలలో భారత్ స్వర్ణాలు సాధించింది. 
  • 2014, అక్టోబరు 12: ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. 
  • 2014, అక్టోబరు 19: భారత్‌లో పర్యటిస్తున్న వెస్టీండీస్ క్రికెట్ జట్టు అర్థాంతరంగా పర్యటనను ముగించింది.
  • 2014, అక్టోబరు 21: బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియాన్‌కు ప్రియురాలి హత్యకేసులో ఐదేళ్ళ జైలుశిక్ష విధించబడింది. 
  • 2014, అక్టోబరు 22: ఆసియా క్రీడలలో పతకం తీసుకోవడానికి నిరాకరించిన బాక్సర్ సరితాదేవిని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సస్పెన్షన్ విధించింది.
    నవంబరు 2014:
  •  2014, నవంబరు 2: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్‌కు చెందిన మిస్బాహుల్‌హక్ 21 బంతులో అర్థశతకం పూర్తిచేసి కొత్త రికార్డు నెలకొల్పాడు.
  • 2014, నవంబరు 5: సచిన్ టెండూల్కర్ రాసిన ఆత్మకథ "ప్లేయింగ్ ఇట్ మై వే" ముంబాయిలో విడుదలైంది. 
  • 2014, నవంబరు 8: జాతీయ సీనియర్ స్క్వాష్ పురుషుల టైటిల్‌ను హరిందర్ పాల్ సింగ్, మహిళల టైటిల్‌ను జ్యోత్స్న సాధించారు. 
  • 2014, నవంబరు 8: డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్‌ను సల్గావ్‌కర్ జట్టు సాధించింది.
  • 2014, నవంబరు 10: హైదరాబాదుకు చెందిన ఆశిష్‌రెడ్డి, రవికిరణ్‌లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 10వ వికెట్టుకు 128 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సృష్టించారు.
  • 2014, నవంబరు 13: రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 
  • 2014, నవంబరు 14: బాక్సింగ్ ఇండియాకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం శాశ్వత సభ్యత్వం కల్పించింది.
  • 2014, నవంబరు 16: చైనా బ్యాడ్మింటన్ ఓపెన్ సీరీస్ పురుషుల సింగిల్స్‌ను కిదాంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్‌ను సైనా నెహ్వాల్ గెలుచుకున్నారు. 
  • 2014, నవంబరు 18: దిలీప్ వెంగ్‌సర్కార్‌కు బీసీసీఐ సి.కె.నాయుడు జీవితకాల సాఫల్య అవార్డును ప్రకటించింది. 
  • 2014, నవంబరు 21: శాప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను భారత్ సాధించింది.
  • 2014, నవంబరు 23: డేవిస్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి స్విట్జర్లాండ్ కప్ సాధించింది.  
  • 2014, నవంబరు 26: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. 
  • 2014, నవంబరు 27: బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించాడు. 
  • 2014, నవంబరు 31: మకావు ఓపెన్ బ్యాడ్మింటన్‌లో పి.వి.సింధూ టైటిల్ సాధించింది.
డిసెంబరు 2014:
  • 2014, డిసెంబరు 3: దేవదర్ ట్రోఫీని ఈస్ట్ జోన్ గెల్చుకుంది.
  • 2014, డిసెంబరు 5: బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్-11 విభాగంలో తెలుగు బాలిక మౌనిక రజతం సాధించింది. 
  • 2014, డిసెంబరు 15: చాంపియన్స్ ట్రోఫి హాకీని జర్మనీ కైవసం చేసుకుంది. 
  • 2014. డిసెంబరు 17: బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధం విధించింది. 
  • 2014, డిసెంబరు 20: ఇండియన్ సూపర్ లిగ్ (ISL) టైటిల్‌ను అథ్లెటికో డి కోల్‌కత కైవసం చేసుకుంది. 
  • 2014, డిసెంబరు 20: ప్రపంచకప్ కబడ్డి పురుషుల మరియు మహిళల టైటిళ్ళను భారత్ సాధించింది. 
  • 2014, డిసెంబరు 30: టెస్ట్ క్రికెట్ నుంచి మహేంద్రసింగ్ ధోని రిటైర్‌మెంట్ అయినట్లు ప్రకటించాడు.

ఇవి కూడా చూడండి: క్రీడా వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2015,


6 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మీరు నా బ్లాగుపై చూపే అభిమానానికి కృతజ్ఞతలండీ వెంకట్ గారు.

      తొలగించండి
  2. sir thank you small correction 2014 november 18 lo dilip vengsarkar ani undali

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టైపింగ్ పొరపాటును సరిదిద్దాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

      తొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక