31, మార్చి 2015, మంగళవారం

రాయచూర్ జిల్లా (Raichur District)

రాయచూర్ జిల్లా
రాష్ట్రంకర్ణాటక
వైశాల్యం8,386 చకిమీ
జనాభా19,28,812 (2011)


రాయచూర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది కర్ణాటకలో తూర్పు భాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యభాగంలో ఉన్న ఈ జిల్లా ప్రాంతం మధ్యయుగ చరిత్రలో రాయచూర్ డోబ్‌గ్ పిలువబడింది. జిల్లా వైశాల్య 8,386 చకిమీ. 2011 లెక్కల ప్రకారం రాయచూర్ జిల్లా జనాభా 19,28,812. అశోకుని శిలాశాసనం లభించిన మస్కి, హట్టి బంగారు గనులు ఈ జిల్లాలోనివి. జిల్లాలో 5 తాలుకాలు కలవు. కన్నడ వాగ్గేయకారుడు జగన్నాథ దాస, రాజకీయ నాయకుడు కొల్లూర్ మల్లప్ప, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ ఈ జిల్లాకు చెందినవారు.

భౌగోళికం:
జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది సరిహద్దుగా ప్రవహిస్తుండగా ఉత్తరాన కృష్ణానై సరిహద్దుగా ఉంది. ఈ రెండు నదులకు చెందిన పలు ఉపనదులు జిల్లా మధ్యలో ప్వహిస్తున్నాయి. జిల్లా 15 09’ - 16 34’ ఉత్తర అక్షాంశం మరియు 75 46’  77 35' తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించియుంది.

సరిహద్దులు:
రాయచూర్ జిల్లాకు ఉత్తరాన యాద్‌గిర్ జిల్లా, వాయువ్యాన బీజాపూర్ జిల్లా, పశ్చిమాన బాగల్‌కోట్ జిల్లా, దక్షిణాన బళ్ళారి జిల్లా, నైరుతిన కొప్పల్ జిల్లా, తూర్పున తెలంగాణలోని నారాయణపేట జిల్లా, ఈశాన్యాన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రాయచూరు కోట
చరిత్ర:
జిల్లాకు పురాతనమైన చరిత్ర ఉంది. లింగ్సుగుర్ తాలూకా మస్కి వద్ద అశోకుని శాసనం లభించింది. మౌర్యుల తర్వాత ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, కదంబులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాలచూరి, కాకతీయులు, విజయనగర పాలకులు, బహమనీలు పాలించారు. రాయచూరు ప్రాంతంలో విజయనగర రాజులకు, బహమనీ సుల్తానులకు మధ్యన పలు యుద్ధాలు సంభవించాయి. 1363లో రాయచూర్ ప్రాంతాన్ని బహమనీ సుల్తానులు స్వాధీనం చేసుకున్నారు. 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర రాజు ఓడిపోయిన తతువాత బీజపూర్ రాజులు ఈ ప్రాంతాన్ని తిరిగి వశం చేసుకున్నారు. 1853 - 1860 వరకు ఔరంగజేబు పాలనలో ఆ తర్వాత హైదరాబాదు నిజాంల పాలనలో ఉండింది. హైదరాబాదు విమోచనం తరువాత 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ప్రకారం 1956లో మైసూరు రాష్ట్రంలో (ఇప్పటి కర్ణాటక రాష్ట్రం)లో భాగం అయింది.

రాయచూర్ థర్మల్ ప్రాజెక్టు
జనాభా:
2011 లెక్కల ప్రకారం రాయచూర్ జిల్లా జనాభా 19,28,812. భారతదేశంలోని 640 జిల్లాలలో ఇది 246వ స్థానంలో ఉంది.

ప్రముఖ పట్టణాలు:
రాయచూర్, లింగ్సుగూర్, సింధనూర్, దేవదుర్గ, మాన్వి ఈ జిల్లాలోని పెద్ద పట్టణాలు.

ఆర్ధికం:
జిల్లాలో శక్తి నగర్ వద్ద " రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్" ఉంది. రాయచూర్ నగరానికి 90 కి.మీ దూరంలో హట్టి వద్ద బంగారు గనులు ఉన్నాయి. కృష్ణానది మీద నారాయణపూర్ వద్ద ఆనకట్ట నిర్మించబడింది. రాయచూర్ వరి పంటకు ప్రసిద్ధి చెందింది.

రవాణా సౌకర్యాలు:
వాడి గుంతకల్ రైలుమార్గం జిల్లాగుండా వెళ్ళుచున్నది. 2014లో కొత్తగా గద్వాల నుంచి రాయచూర్ రైలుమార్గం ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ రోడ్డును కొత్తగా జాతీయ రహదారిగా ప్రకటించారు. జిల్లాలో విమానాశ్రయం లేదు సమీపంలో ఉన్న విమానాశ్రయం హైదరాబాదులోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.


హోం,
విభాగాలు:
కర్ణాటక జిల్లాలు, రాయచూరు జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక