9, మే 2015, శనివారం

విశాఖపట్టణం జిల్లా (Visakhapatnam DIstrict)

వైశాల్యం11,161 చకిమీ
పరిపాలన కేంద్రంవిశాఖపట్టణం
జనాభా42,88,113
మండలాలు43
విశాఖపట్టణం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వైశాల్యం 11,161 చకిమీ మరియు జనాభా (2011 ప్రకారం) 42,88,113. కోల్‌కత-చెన్నై రైలుమార్గం మరియు 5వ నెంబరు జాతీయ రహదారి జిల్లా గుండా వెళుచున్నాయి.  1803లో విశాఖపట్టణం జిల్లా అవతరించగా 1950లో జిల్లాను విభజించి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటుచేశారు. 1979లో విజయంనగరం జిల్లా ఏర్పాటు సమయంలో ఈ జిల్లా తూర్పు ప్రాంతాలు అందులో చేర్చబడ్డాయి. ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 43 మండలాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. గురజాడ అప్పారావు, తెన్నేటి విశ్వనాథ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆరుద్ర, చిలుకూరి నారాయణ రావులు జిల్లాకు చెందిన ప్రముఖులు. ఈ జిల్లా పరిపాలన కేంద్రం విశాఖపట్టణం నగరం. భీమునిపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం జిల్లాలోని ఇతర పెద్ద పట్టణాలు.

భౌగోళికం, సరిహద్దులు:
విశాఖపట్టణం జిల్లా 17°15' నుంచి 18°32' ఉత్తర అక్షాంశం మరియు 18°54' నుంచి 83°30' తూర్పు రేఖాశం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు తూర్పున విజయనగరం జిల్లా, పశ్చిమాన పశ్చిమ గోదావరి జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 11,161 చదరపు కిలోమీటర్లు. తూర్పు కనుమలు జిల్లాలో వ్యాపించియున్నాయి. శారద, తాండవ నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. జిల్లలో 3 రెవెన్యూ డివిజన్లు, 43 రెవెన్యూ మండలాలు కలవు.

బావికొండ బౌద్ధస్తూపం
చరిత్ర:
అశోక చక్రవర్తి కళింగ యుద్ధం చేసిన తర్వాత ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది. అంతకు క్రితం కళింగ రాజ్యంలో కొనసాగింది. ఆ తర్వాత వేంగీ చాళుక్యులు, పల్లవులు, చోళులు, గాంగరాజులు, గజపతులు, విజయనగర రాజులు, కొండవీటి రెడ్డిరాజులు, గోల్కొండ సుల్తానులు, మొఘలులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ తర్వాత బ్రిటీష్ పాలనలో మద్రాసు ప్రావిన్సులో కొనసాగి స్వాతంత్ర్యానంతరం మద్రాసు రాష్ట్రంలో కొనసాగింది. 1803లో విశాఖపట్టణం జిల్లా ఏర్పాటుచేయబడింది. 1950లో విశాఖపట్టణం జిల్లాను విభజించి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటుచేశారు. 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణలతో ఈ రాష్ట్రాలలో భాగమైంది. 1979లో ఈ జిల్లాకు చెందిన తూర్పు ప్రాంతాలను కొత్తగా ఏర్పాటుచేసిన విజయనగరం జిల్లాలో విలీనం చేశారు.

సింహాచలం ఆలయం
పర్యాటక ప్రదేశాలు:
జిల్లా కేంద్రం విశాఖపట్టణంలో విమానాశ్రయం, నూనెశుద్ధి కేంద్రం, రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్, డాల్ఫిన్ నోస్‌లు ఉండగా భీమునిపట్నంలో సహజ ఓడరేవుతో పాటు బౌద్ధక్షేత్రం ఉంది. బావికొండ, తొట్లకొండలలో కూడా బౌద్ధమతపు చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. సింహాచలంలో శ్రీవరహా నరసింహస్వామి ఆలయం ఉంది. అరకులోయ, బొర్రా గుహలు సందర్శకులకు కనువిందు చేసే ప్రాంతాలు.

రాజకీయాలు:
జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇవి 3 లోకసభ నియోజకవర్గాలలో భాగంగా ఉన్నాయి. అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో పూర్తిగా 7 సెగ్మెంట్లు జిల్లాకు చెందినవి కాగా విశాఖపట్టణంలో 6, అరకులో 2 సెగ్మెంట్లు భాగంగా ఉన్నాయి. 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 11, తెలుగుదేశం పార్యీ 4 స్థానాలలో విజయం సాధించగా, 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 12, వైకాపా 3 స్థానాలలో విజయం సాధించాయి. 2009లో విశాఖపట్టణం లోకసభ స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గెలుపొంది కేంద్రమంత్రివర్గంలో స్థానం పొందగా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తెదేపా మద్దతుతో విజయం సాధించారు. అనకాపల్లి లోకసభ స్థానంలో 2009లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు, విశాఖపట్టణం జిల్లా,


 = = = = =


2 వ్యాఖ్యలు:

 1. 1936 లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రస్తుతం ఉన్నవిశాఖ పట్టణం జిల్లాకి ఏమీ జరగనే లేదా..? ఆ విషయం రాయకపోతే విశాఖ పట్టణం జిల్లా చరిత్ర అసమగ్రం గా నే నిలిచిపోదా..? అన్నది నా ప్రశ్న.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చిన్న విభాగంలో అన్నీ వివరించడం సాధ్యం కాలేదు. విశాఖపట్టణం జిల్లా చరిత్రపై ప్రత్యేక వ్యాసం వ్రాసినప్పుడు పూర్తి వివరాలు ఇస్తాను.

   తొలగించు

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక