గంగాధర కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో వాయువ్యం వైపున ఉంది. ఈ మండలము కరీంనగర్ రెవెన్యూ డివిజన్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ప్రాచీనకాలంలో ఈ ప్రాంతం గొప్ప జైనకేంద్రంగా విలసిల్లింది. క్రీ.శ.10వ శతాబ్ది నాటి కందపద్య శాసనం ఉన్న బొమ్మలమ్మ గుట్ట ఈ మండలంలోనే ఉంది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 33 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున రామడుగు మండలం, దక్షిణాన కొత్తపల్లి మండలం, ఉత్తరాన జగిత్యాల జిల్లా, పశ్చిమాన రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండల కేంద్రం గంగాధర 18.605252° ఉత్తర అక్షాంశం, 79.006691°తూర్పు రేఖాశంపై ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46879. ఇందులో పురుషులు 23338, మహిళలు 23541. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49181. ఇందులో పురుషులు 24456, మహిళలు 24725. రవాణా సౌకర్యాలు: జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2014లో మండల అద్యక్షులుగా దూలం బాలగౌడ్ ఎన్నికయ్యారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన శ్రీరాం మధు, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పుల్కం అనురాధ ఎన్నికయ్యారు.
గంగాధర మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achampalli, Burgupall, Gangadhara, Garsekurthi, Gattuboothkur, Islampur, Kachireddipalli, Kondaipalli, Kurikial, Mallapur, Nagireddipur, Narasimhulapalli, Narayanpur, Nyalakondapalli, Oddyaram, Ryalapalli, Sarvareddipalli, UpparaMallial, Venkataipalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గంగాధర (Gangadhara): గంగాధర కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామంలో రుద్రమదేవి కాలం నాటి శ్రీవేంకటేశ్వరాలయం ఉంది. కురిక్యాల (Kurikyal): కురిక్యాల కరీంనగర్ జిల్లా గంగాధర మండలమునకు చెందిన గ్రామము. కురిక్యాల, కొండన్నపల్లి గ్రామాల మధ్యన చరిత్ర ప్రసిద్ధి చెందిన బొమ్మలమ్మ గుట్ట ఉంది. గుట్టపై ప్రాచీన శాసనాలున్నాయి. కరికాల చోళుని పేరుమీదుగా ఈ గ్రామానికి కురిక్యాల పేరువచ్చినట్లుగా చెబుతారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gangadhara Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి