కొత్తపల్లి కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 8 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. చారిత్రకమైన ఎలగిందల్ ఖిలా ఈ మండలంలో ఉంది. దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. కరీంనగర్ మండలంలోని 12 గ్రామాలతో ఈ మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన గంగాధర మరియు రామడుగు మండలాలు, తూర్పున కరీంనగర్ గ్రామీణ మండలం, దక్షిణాన గన్నేరువరం మండలం, ఆగ్నేయాన కరీంనగర్ పట్టణ మండలం, పశ్చిమాన రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. జనాభా: రాజకీయాలు: ఈ మండలము కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన పిల్లి శ్రీలత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పిట్టల కరుణ ఎన్నికయ్యారు.
కొత్తపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Asifnagar, Baddipalli, Chinthakunta, Elgandal, Kamanpur, Khazipur, Kothapalli(Haveli), Laxmipur, Malkapur, Nagulamallial, Rekurthi, Sitarampur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఎలగందల్ (Elagandal): ఎలగందల్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది కరీంనగర్ పట్టణానికి 13 కిమీ దూరంలో ఉన్నది. ఒకప్పుడు ఇది ఒకప్పుడు జిల్లా కేంద్రంగా వ్యవహరించింది. ఇక్కడ 200 అడుగుల ఎత్తయిన గుట్ట, గుట్టపై కోట ఉంది. 1754లో జఫరుద్దౌలా మసీదు నిర్మించాడు. కోటలో నరసింహస్వామి దేవాలయం ఉంది.
రేకుర్తి (Rekurti):
రేకుర్తి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలమునకు చెందిన గ్రామము. 1988 ఫిబ్రవరి 20న లయన్స్ క్లబ్ ఉదార కంటి ఆసుపత్రి ప్రారంబించారు..
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kothapalli Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి