రామడుగు కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. పెద్దపల్లి-కరీంనగర్ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. వెదిర పరిధిలో ఏటా మల్లన్న జాతర జరుగుతుంది.
లక్ష్మీపూర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన (ప్యాకేజీ-8) గాయత్రి పంప్‌హౌస్ నిర్మించబడింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున చొప్పదండి మండలం, దక్షిణాన కొత్తపల్లి మండలం, పశ్చిమాన గంగాధర మండలం, ఉత్తరాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48067. ఇందులో పురుషులు 23736, మహిళలు 24331. రాజకీయాలు: ఈ మండలము చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కలిగేటి కవిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మారుకొండ లక్ష్మి ఎన్నికయ్యారు.
రామడుగు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chippakurthi, Dathojipet, Deshrajpalli, Fakeerpet, Gopalraopet, Gundi, Kistapur, Kokkerakunta, Koratpalli, Laxmipur, Mothe, Ramadugu, Rudraram, Shanagar, Sriramulapalli, Thirmalapur, Vannaram, Vedira, Velichal
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
లక్ష్మీపూర్ (Laxmipur): లక్ష్మీపూర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలమునకు చెందిన గ్రామము. లక్ష్మీపూర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్‌హౌస్ నిర్మించబడింది. వెల్చాల్ (Velchal): వెల్చాల్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలమునకు చెందిన గ్రామము. 2018లో ఈ గ్రామపంచాయతికి పారిశుద్ధ్య విభాగంలో ఉత్తమ పంచాయతీగా రాష్ట్రపతి అవార్డు లభించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ramadugu Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి