రాజాపేట యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు ఉన్నాయి. భౌగోళికంగా ఈ మండలము జిల్లాలోనే అతి ఉత్తరాన ఉంది. ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజన్, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: జిల్లాలో ఈ మండలం అతి ఉత్తరాన జనగామ మరియు సిద్ధిపేట జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన యాదగిరిగుట్ట మండలం, పశ్చిమాన తుర్కపల్లి మండలం, ఆగ్నేయాన ఆలేరు మండలం, ఉత్తరాన మరియు తూర్పున జనగామ జిల్లా, వాయువ్యాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 40612, 2011 నాటికి జనాభా 38513. ఇందులో పురుషులు 19597, మహిళలు 18916. పట్టణ జనాభా 4011, గ్రామీణ జనాభా 34502 రాజకీయాలు: ఈ మండలము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Basanthapuram, Begumpet, Bondugula, Burugu Pally, Challur, Doodi Venkatapuram, Jala, Kalvapally, Kurraram, Lakshmakka Pally, Narsapuram, Nemila, Pamukunta, Paru Pally, Raghunadhapuram, Rajapet, Renikunta, Singaram, Somaram
ప్రముఖ గ్రామాలు
బేగంపేట (Begumpet):బేగంపేట యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలమునకు చెందిన గ్రామము. సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఈ గ్రామానికి చెందినవారు. రేణికుంట (Renikunta): ఈ గ్రామము విమోచనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. ప్రముఖ విమోచనోద్యమకారులు రాయల చంద్రయ్య, దవ్వ అచ్చయ్య, కమ్రు అచ్చయ్య, బాదుల బలరాం, గొడుగు బాలయ్య, కొప్పుల నరహరి, నాగపురి బాలయ్య, వడ్ల బ్రహ్మయ్య, యాదుల బుచ్చయ్య, మేకల చంద్రయ్య, కుమ్మరి ఆగయ్య ఈ గ్రామానికి చెందినవారు ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Rajapet Fort, Rajapet Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
Hello Chandra garu...
రిప్లయితొలగించండిPlease add more details of RAJAPETA SAMSTHAN FORT, you can visit the website of RAJAPETA (www.rajapeta.com)
Thanks
Panduranga Chary
Rajapeta
Hello renikunta lo chintalapuri Ramreddy great freedom fighter your missing please add that.
రిప్లయితొలగించండి