సదాశివపేట్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో ఒక పురపాలక సంఘం, 30 రెవెన్యూ గ్రామాలు కలవు. ఇటీవల పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలు. పూనే-విజయవాడ 65 (9)వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: సదాశివపేట మండలం సంగారెడ్డి జిల్లాలో దక్షిణం వైపున వికారాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరానా పుల్కల్ మండలం, తూర్పున సంగారెడ్డి మండలం, దక్షిణాన కొండాపూర్ మండలం, పశ్చిమాన మునిపల్లి మండలం, నైరుతిన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా 65వ నెంబరు (పాతపేరు 9వ) జాతీయ రహదారి వెళ్ళుచున్నది. చరిత్ర: ఈ ప్రాంతం నిజాం కాలంలో మెదక్ సుబాలో భాగంగా ఉండేది. సెప్టెంబరు 17, 1948న హైదరాబాదు విమోచనోద్యమంతో భారత యూనియన్‌లో భాగమై హైదరాబాదు రాష్ట్రంలో 1956 వరకు కొనసాగింది. 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగింది. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో సదాశివపేటకు చెందిన విద్యార్థి శంకర్ పోలీసు కాల్పులలో మరణించి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడుగా అవతరించాడు. 2009-14 కాలంలో కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఈ మండలంలో ఉద్యమం ఉధృతంగా సాగింది. 42 రోజులపాటు సకలజనుల సమ్మె కొనసాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మహిళలు, న్యాయవాదులు తదితరులతో తెలంగాణ ఉద్యమపోరు హోరెత్తింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ మండలం కూడా తెలంగాణ రాష్ట్రంలో భాగంగా మారింది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్విభజన సమయంలో మెదక్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో చేరింది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 94273. ఇందులో పురుషులు 47745, మహిళలు 46528. అక్షరాస్యుల సంఖ్య 58013. పట్టణ జనాభా 47750, గ్రామీణ జనాభా 46523. రాజకీయాలు: ఈ మండలం సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ankenpally, Aroor, Atmakur, Babilgaon, Chandapur, Enkepally, Etigaddasangam, Ishratabad, Kambalpally, Kolkur, Konapur, Machireddipally, Maddikunta, Malapahad, Melgirpet, Mubarakpur, Nagulpally, Nandi Kandi, Nizampur, Peddapur, Pottipally, Rejinthal, Sadasivpet (M + OG), Siddapur, Suraram, Thangadpally, Veltur, Venkatapur, Yavapur (DP), Yellaram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
సదాశివపేట్ (Sadasivpet):సదాశివపేట్ సంగారెడ్డీ జిల్లాకు చెందిన మండలకేంద్రము మరియు పురపాలకసంఘం. ఈ పట్టణం 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. పట్టణంలో ఎవరెస్ట్ ఆర్గానిక్ ప్లాంట్ ఉంది. ఎంఆర్‌ఎఫ్ కంపెనీకి చెందిన టైర్లు తయారుచేసే పరిశ్రమ ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Sadashivepet or Sadasivapet Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి