పుల్కల్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలం దక్షిణ సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది. మంజీరానదిపై సింగూరు గ్రామం వద్ద సింగూరు ప్రాజెక్టు నిర్మించబడింది.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. జూలై 13, 2020 నాడు ఈ మండలంలోని 16 గ్రామాలను విడదీసి కొత్తగా చౌటకూరు మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్‌లో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: పులికల్ మండలానికి ఉత్తరాన హత్నూరా మండలం, ఉత్తరాన ఆందోల్ మండలం, ఆగ్నేయాన సంగారెడ్డి మండలం, దక్షిణాన సంగారెడ్డి మండలం, పశ్చిమాన మునిపల్లి మండలం, వాయువ్యాన వట్‌పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51335. ఇందులో పురుషులు 25791, మహిళలు 25544. అక్షరాస్యుల సంఖ్య 25994. రాజకీయాలు: ఈ మండలం ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Baswapur, Esojipet, Gongulur, Hunnapur (DP), Kodur, Lakshmisagar, Manthoor, Minpur, Muddaipet, Mudimanikyam, Peddareddipet, Pocharam, Pulkal, Raipahad, Seripeddareddipet (DP), Seriramreddiguda, Singoor, Sureddi Itkyal,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
సింగూర్ (Singur):సింగూరు గ్రామపరిధిలో మంజీరానదిపై సింగూరు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు హైదరాబాదు నగరానికి కూడా త్రాగునీటిని అందిస్తుంది. సింగూరు ప్రాజెక్టు వల్ల ఈ గ్రామం పర్యాటక కేంద్రంగా మారింది. సుల్తాన్‌పూర్ (Sulthanpur): సుల్తాన్‌పూర్ గ్రామపరిధిలో JNTU ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Pulkal or Pulikal Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి