నంగనూరు సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2016 జిల్లాల పునర్వవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న ఈ మండలం మెదక్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన సిద్ధిపేట జిల్లాలోకి మారింది.
మండలంలోని కోనాయిపల్లి శ్రీవేంకటేశ్వరాలయం కేసిఆర్‌కు సెంటిమెంటు ఆలయంగా పేరుపొందింది. ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే ఆయన ఏ పనైనా చేస్తారు. ఎన్నికల నామినేషన్ వేసేముందు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తారు. నర్మెట్ట గ్రామపరిధిలో శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కోహెడ మండలం, చిన్నకోడూరు మండలం, తూర్పున అక్కన్నపల్లి మండలం, దక్షిణాన మద్దూరు మండలం, చేర్యాల మండలం, పశ్చిమాన సిద్ధిపేట పట్టణ మండలం, కొండపాక మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41807. ఇందులో పురుషులు 21006, మహిళలు 20801. అక్షరాస్యుల సంఖ్య 23280. రాజకీయాలు: ఈ మండలము సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: అంకుశాపూర్ (Ankushapur), అంకెన్‌పల్లి (Ankenapally), కొండమరాజ్‌పల్లి (Kondamrajpally), కోనాయిపల్లి (Konaipally), ఖాటా (Khata), ఖానాపూర్ (Khanapur), గట్ల మల్యాల్ (Gatlamallial), ఘన్‌పూర్ (Ghanpur), తిమ్మాయిపల్లి (Thimmaipally), నంగనూరు (Nanganoor), నర్మెట్ట (Narmetta), నాగరాజపల్లి (Nagarajpally), పాలమాకుల (Palamakula), బడ్డిపగడ (Baddipadaga), మక్దూంపూర్ (Maqdumpur), ముండ్రాయి (Mundrai), రాంపూర్ (Rampur), రాజగోపాలపేట్ (Rajagopalpet), వెంకటాపూర్ (Venkatapur),
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఘణపూర్ (Ghanpur):ఘణపూర్ సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ బీరప్ప ఆలయం ఉంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. కోనాయపల్లి (Konayapally): కోనాయపల్లి సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ వెంకటేశ్వరాలయం ఉంది. ఇది కె.చంద్రశేఖర్ రావు సెంటిమెంటు గుడిగా ప్రసిద్ధిచెందినది. ఈ దేవాలయంలో పూజలు చేసిన తర్వాతే కె.సి.ఆర్. ఏ పనైనా చేస్తారు. 1985లో తొలిసారి విజయం సాధించినప్పుడు నామినేషన్ వేసే ముందు గుడిలో పూజలు చేసి సంతకం కూడా ఇక్కడే చేశారు. నర్మెట్ట (Narmetta): నర్మెట్ట సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలమునకు చెందిన గ్రామము. గ్రామ పరిధిలో శిలాయుగపు సమాధులు ఉన్నాయి. త్రవ్వకాలలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Nanganur Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి