చిన్నకోడూర్ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సిద్ధిపేట తొలి ఎమ్మెల్యే గురువారెడ్డి, టీఎన్‌జివో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దేవీ ప్రసాద్ ఈ మండలమునకు చెందినవారు. అనంతసాగర్‌లో వీణావాకక్షేత్రం ఉంది.
2016 జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలం మెదక్ జిల్లా నుంచి కొత్తగా అవతరించిన సిద్ధిపేట జిల్లాలో చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రంగనాయకసాగర్ ప్రాజెక్టును ఈ మండలంలో (చంద్లాపూర్, పెద్దకోడూరు శివారులలో) నిర్మిస్తున్నారు. మల్లారం పంప్‌హౌస్ ఈ మండలం పరిధిలో ఉంది. భౌగోళికం, సరిహద్దులు: చిన్నకొండూరు మండలం సిద్ధిపేట జిల్లాలో ఉత్తరం వైపున రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఈశాన్యాన బెజ్జంకి మండలం, తూర్పున కోహెడ మండలం, దక్షిణాన నంగనూరు మండలం మరియు సిద్ధిపేట పట్టణ మండలం, పశ్చిమాన సిద్ధిపేట గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58195. ఇందులో పురుషులు 28943, మహిళలు 29252. అక్షరాస్యుల సంఖ్య 31136. రాజకీయాలు: ఈ మండలము సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allipur, Ananthasagar, Chandlapur, Cherla Ankireddipally, Chinnakodur, Chowdaram, Gangapur, Gonepally, Ibrahim Nagar, Kasturipally, Machapur, Mallaram, Medipally, Oblapur, Peddakodur, Ramancha, Ramuni Patla, Shivunipally, Sikandlapur, Vittalapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అనంతసాగర్ (Ananthsagar):అనంతసాగర్ సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన గ్రామము. వీణాపాక క్షేత్రంగా వెలుగుందుతున్న సరస్వతీ ఆలయం ఈ గ్రామంలో ఉంది. దేశంలోనే మొట్టమొదటి వీణాపాణి క్షేత్రంగా భాసిల్లుతోంది. ఏటా వసంతపంచమి సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రామంచ (Ramancha): రామంచ సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన గ్రామము. సిద్ధిపేట తొలి ఎమ్మెల్యే గురువారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఈయన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Chinakodur Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి