సిద్దిపేట్ గ్రామీణ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. తెరాస వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, చిత్రకారుడు కాపురాజయ్య, సాహితీవేత్త వేముగంటి నరసింహాచార్యులు ఈ మండలమునకు చెందినవారు. 2015 తెలంగాణ తొలి ఆవిర్భావ పురస్కారాల సందర్భంగా తెలంగాణలో ఉత్తమ మండలంగా సిద్ధిపేట ఎంపికైంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం మెదక్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన సిద్ధిపేట జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: సిద్ధిపేట (గ్రామీణ) మండలం జిల్లాలో తూర్పువైపున రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున చిన్నకోడూరు మండలం, ఆగ్నేయాన సిద్ధిపేట (పట్టణ) మండలం, దక్షిణాన తొగుట మండలం, పశ్చిమాన దుబ్బాక మండలం, ఉత్తరాన రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ankampet, Bussapur, Chinna Gundavelli, Chintamadaka, Gurralagondi, Ibrahimpur, Irkode, Jakkapur, Machapur [Patti Dubbak], Malyal, Narayanraopet, Pullur, Raghavapur, Raorukula, Seetharampally, Tornal, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చిన్నగుండవెళ్ళి (China Gundavelli):చిన్నగుండవెళ్ళి సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట గ్రామీణ మండలమునకు చెందిన గ్రామము. గ్రామ జనాభా 2600. 2009లో ఈ గ్రామం నిర్మల్ పురస్కారం పొందింది. 2006-11 కాలంలో గ్రామ సర్పంచిగా కోటగిరి శ్రీహరిగౌడ్ పనిచేశారు. గ్రామదేవత గుండెళ్ళమ్మ పేరు మీదుగా చిన్నగుండవెళ్ళి పేరు వచ్చింది. తెలంగాణాపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి ఏర్పాటుచేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజాభాప్రాయాన్ని సేకరించింది. చింతమడక (Chintamadaka): చింతమడక సిద్ధిపేట జిల్లా సిద్దిపేట (గ్రామీణ) మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వగ్రామం. పుల్లూరు (Pullur): పుల్లూరు సిద్దిపేట్ జిల్లా సిద్దిపేట్ (గ్రామీణ) మండలమునకు చెందిన గ్రామము. పూర్వం దీన్ని పులులూరుగా వ్యవహరించేవారు. ఈ ప్రాంతం దట్టమైన అటవీప్రాంతంలో ఉండడం, పులుల సంచారం అధికంగా ఉండుటచే పులులూరుగా పిలువబడింది. కాలక్రమేణ పులులూరు పుల్లూరుగా మారింది. ఇక్కడ ఉన్న పెద్దబండపై వనవాసం సమయంలో శ్రీరాములు కొంతకాలం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ బండ రామస్వామి బండగా కూడా పిలువబడుతుంది. పుల్లూరులో 94 ఎకరాలలో లక్ష్మీనరసింహస్వామి బండ విస్తరించి ఉంది. కాకతీయుల కాలంలో లక్ష్మీనరసింహ క్షేత్రం నిర్మించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Siddipet Rural Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి