భిక్నూర్ మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. కామారెడ్డి నుంచి 2 సార్లు విజయం సాధించిన గంప గోవర్థన్, డిసీసీబి చైర్మెన్‌గా పనిచేసిన ఎడ్ల రాజిరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. ఇది కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో భాగము. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు దోమకొండ తాలుకాలోని గ్రామాలు. మండలం మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నాయి.
2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో భిక్నూరు మండలంలోని 4 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన రాజంపేట మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: భిక్నూర్ మండలం కామారెడ్డి జిల్లాలో దక్షిణంవైపున మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన దోమకొండ మండలం, తూర్పున బీబీపేట్ మండలం, పశ్చిమాన రాజంపేట మండలం, దక్షిణాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59688. ఇందులో పురుషులు 29196, మహిళలు 30492. రాజకీయాలు: భిక్కనూరు మండలం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. కామారెడ్డి నుంచి 1999, 2009లలో విజయం సాధించిన గంప గోవర్థన్ ఈ మండలమునకు చెందినవారు. 2019లో భిక్నూరు ZPTCగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తాటిపాముల పద్మ ఎన్నికయ్యారు.
భిక్నూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anthampalle, Baswapur, Bhagirathipalle, Bhiknoor, Gurjakunta, Isannapalle, Jangampalle, Kachapur, Kancherla, Laxmidevipalle, Mallupalle, Peddamallareddy, Rameshwarpalle, Ryegatlapalle, Thippapu
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బస్వాపూర్ (Baswapur):బస్వాపూర్ కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలమునకు చెందిన గ్రామము. 1994, 2009లలో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంప గోవర్థన్ ఈ గ్రామానికి చెందినవారు. గంపగోవర్థన్ బస్వాపూర్ గ్రామ సింగిల్ విండో చైర్మెన్‌గా కూడా పనిచేశారు. భిక్నూరు (Bhiknoor): భిక్నూరు కామారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామసమీపంలో గుట్టపై సిద్ధరామేశ్వర దేవాలయం ఉంది. ఇది పురాతనమైన ఆలయం. కాకతీయులకు పూర్వం ఇది నిర్మితమైనట్లు తెలియుచున్నది. తర్వాత కాకతీయుల కాలంలో ఇది అభివృద్ధి చేయబడింది. తర్వాత దోమకొండ సంస్థానాధిపతుల వశమై స్వాతంత్ర్యం వరకు వారి అధీనంలోనే ఉండింది. ఇప్పుడు ఇది దేవాదాయశాఖ అధీనంలోకి వచ్చింది. రామేశ్వర్ పల్లి (Rameshwar Pally): రామేశ్వర్ పల్లి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలమునకు చెందిన గ్రామము. 1995 ఎంపీటీసి ఎన్నికలలో ఈ గ్రామానికి చెందిన కున్న సత్తమ్మ విజయం సాధించి భిక్కనూరు మండల అధ్యక్షురాలిగా 2000 వరకు పనిచేసింది. ఈ గ్రామానికి చెందిన అడ్ల రాజిరెడ్డి కామారెడ్డి నుంచి 2 సార్లు పోటీచేసి ఓడిపోయారు. అడ్ల రాజిరెడ్డి డిసిసీబి చైర్మెన్‌గా, రామేశ్వర్ పల్లి సింగిల్ విండో చైర్మెన్‌గా, సర్పంచిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Bhiknur Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి