మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 34 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, మాచారెడ్డి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే జీడిపల్లి విఠల్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మాచారెడ్డి మండలంలోని 5 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన రామారెడ్డి మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో తూర్పువైపున రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన దోమకొండ మండలం, పశ్చిమాన కామారెడ్డి మండలం, వాయువ్యాన రామారెడ్డి మండలం, తూర్పున రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉత్తరాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: మాచారెడ్డి మండలము కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు కలవు. 2014లో ఎంపీపీగా గ్యార లక్ష్మీ ఎన్నికయ్యారు. 2019 జడ్పీటీసి ఎన్నికలలో తెరాస పార్టీకి చెందిన మినుకూరి రాంరెడ్డి విజయం సాధించారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akkapur, Antampalle, Banda Rameshwarpalle, Bhavanipet, Chukkapur, Devunipalle, Faridpet, Ghanpur (M), Issaipet, Latchapet, Machareddy, Palwancha, Potaram, Rajkhanpet, Somarampet, Tadkapalle, Wadi, Yellampet, Yellapgonda.
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఫరీద్ పేట (Faridpet):ఫరీద్ పేట నిజామాబాదు జిల్లా మాచారెడ్డి మండలమునకు చెందిన గ్రామము. కామారెడ్డి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే జీడిపల్లి విఠల్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Machareddy Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి