చిగురుమామిడి కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో ఓగులాపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు.
ముదిమాణిక్యం, రేకొండ, ముల్కనూర్, చిగురుమామిడి, బొమ్మనపల్లి, సుందరగిరి, ఇందుర్తి, నవాబుపేట, రామంచలలో జల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలున్నాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన తిమ్మాపూర్ మండలం, తూర్పున వి.సైదాపూర్ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన సిద్ధిపేట జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41806. ఇందులో పురుషులు 20948, మహిళలు 20858. అక్షరాస్యుల సంఖ్య 23452. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కొత్త వినిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గీకూరు రవీందర్ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bommanapalli, Chigurumamidi, Indurthi, Kondapur, Mudimanikyam, Mulkanoor, Nawabpeta, Ramancha, Rekonda, Sundaragiri, Ullampalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఓగులాపూర్ (Ogulapur): ఓగులాపూర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలమునకు చెందిన గ్రామము. 2007లో గ్రామ సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబడింది. రిజర్వాయర్ నీటిసామర్థ్యం 1.7 టీఎంసీలు. 6 మండలాల్లోని 73 గ్రామాలలోని 49 వేల ఎకరాల ఆయకట్టుని నిర్ణయించారు. రేకొండ (Rekonda): రేకొండ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలమునకు చెందిన గ్రామము. స్వాతంత్ర్య సమరయోధుడు దుడ్డెల రామస్వామి ఈ గ్రామానికి చెందినవారు. ఈయన 2013, జూలై 24న 82 సం.ల వయస్సులో మరణించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chigurumamidi Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి