తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ విమోచనోద్యకారుడు, రచయిత అనభేరి ప్రభాకర్, ఈ మండలమునకు చెందినవారు. టీఎస్ జెన్‌కో యొక్క నేదునూరు విద్యుత్ ప్రాజెక్టు ఈ మండలంలో నిర్మిస్తున్నారు.
తెలంగాన ఉద్యమంలో ఈ గ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2009 నవంబరు 29న ఆమరణదీక్షకు వెళుతున్న కేసిఆర్‌ను పోలీసులు అలగునూరు వద్ద అరెస్ట్ చేశారు. ఈ మండలానికి చెందిన నుస్తులాపూర్ గ్రామపంచాయతి 2018 సంవత్సరానికి గాను ఈ గ్రామం జాతీయస్థాయిలో స్వచ్ఛ భారత్ పురస్కారం (చైల్డ్ ఫ్రెండ్లీగా గుర్తింపు పొందింది) పొందింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఈశాన్యాన మానకొండూర్ మండలం, తూర్పున శంకరపట్నం మండలం, దక్షిణాన చిగురుమామిడి మండలం, పశ్చిమాన గన్నేరువరం మండలం, ఉత్తరాన కరీంనగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48857. ఇందులో పురుషులు 24113, మహిళలు 24744. అక్షరాస్యుల సంఖ్య 27397. పట్టణ జనాభా 6170, గ్రామీణ జనాభా 42687. రవాణా సౌకర్యాలు: కరీంనగర్ నుంచి హస్నాబాద్ వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కేతిరెడ్డి వనిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన ఏనుకొండ శైలజ ఎన్నికయ్యారు.
తిమ్మాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Alugunur, Kothapalli(P.N), Mallapur, Mannempalli, Mogilipalem, Nallagonda, Nedunur, Nustulapur, Parlapalli, Polampalli, Porandla, Renikunta, Thimmapur, Vachunur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అలగునూరు (Alagunur): అలగునూరు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలమునకు చెందిన గ్రామము. 2009లో తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ గ్రామం వార్తల్లోకి చేరింది. నవంబరు 29, 2009న కరీంనగర్ నుంచి సిద్ధిపేట దీక్షాస్థలికి వెళుతున్నా కేసిఆర్‌ను అలగనూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. నేదునూరు (Nedunur): నేదునూరు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ టీఎస్ జెన్‌కో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. నుస్తులాపూర్ (Nustulapur): నుస్తులాపుర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలమునకు చెందిన గ్రామము. 2018 సంవత్సరానికి గాను ఈ గ్రామం జాతీయస్థాయిలో స్వచ్ఛ భారత్ పురస్కారం (చైల్డ్ ఫ్రెండ్లీగా గుర్తింపు పొందింది) పొందింది. పొలంపల్లి (Polampally): పొలంపల్లి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ విమోచనోద్యమాకారుడు, రచయిత అనభేరి ప్రభాకరరావు ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Thimmapur Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి