వి.సైదాపూర్ కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. క్రీ.శ.1303లో కాకతీయ ప్రతాపరుద్రునికి అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్యన జరిగిన ఉప్పరపల్లి యుద్ధం ఈ మండలంలోని గొడిశాల వద్ద జరిగింది. ఆకునూరు గ్రామ శివారులో సర్వాయిపాపన్న గుట్టలున్నాయి. సర్వాయిపేటలో సర్దార్ పాపన్నగౌడ్ కోట ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున హుజురాబాదు మండలం, పశ్చిమాన చిగురుమామిడి మండలం, ఉత్తరాన శంకరపట్నం మండలం, దక్షిణాన వరంగల్ గ్రామీణ జిల్లా, నైరుతిన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40524. ఇందులో పురుషులు 20229, మహిళలు 20295. అక్షరాస్యుల సంఖ్య 22923. రాజకీయాలు: ఈ మండలము హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పేరల గోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు.
వి.సైదాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akunur, Ammanagurthi, Bommakal, Duddenapalli, Eklaspur, Elabotharam, Ghanpur, Godisala, Raikal, Ramchandrapur, Saidapur, Somaram, Venkepalli, Vennampalli,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
దుద్దనపల్లి (Duddanapalli): దుద్దనపల్లి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలమునకు చెందిన గ్రామము. పారిశుద్ధ్యంలో ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది. 2018లో ఈ పంచాయతీకి నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్ లభించింది.
గొడిశాల (Godishala):
గొడిశాల కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ పంచలింగ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి 600 సం.ల చరిత్ర ఉంది. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడింది. గొడిశాల ప్రాచీననామం ఉప్పరపల్లి. 1303లో కాకతీయ ప్రతాపరుద్రుని చేతిలో అల్లావుద్దీన్ ఖిల్జీకి తొలి ఓటమి ఇక్కడే ఎదురైంది. అది ఉప్పరపల్లి యుద్ధంగా ప్రసిద్ధిచెందింది.
సర్వాయిపేట (Sarvaipet):
సర్వాయిపేట కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలమునకు చెందిన గ్రామము. సర్దార్ పాపన్నగౌడ్ నిర్మించిన కోట గ్రామంలో ఉంది.
వెనకపల్లి (Venakapally):
వెనకపల్లి కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన వేముగంటి వేణుగోపాలరావు ఐ.ఏ.ఎస్.అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
V.Saidabad Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి