చొప్పదండి కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 16 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజన్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
2019లో దేశంలోని 15579 పోలీస్ స్టేషన్లలో చొప్పదండి పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా టాప్-10లో (8వ స్థానం) నిలిచింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన కరీంనగర్ గ్రామీణ మండలం, పశ్చిమాన రామడుగు మండలం, ఉత్తరాన మరియు తూర్పున పెద్దపల్లి జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51173. ఇందులో పురుషులు 25833, మహిళలు 25340. స్త్రీపురుష నిష్పత్తి (981/వెయ్యి పురుషులకు). రవాణా సౌకర్యాలు: ధర్మపురి నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా ఇండీపెండెంట్ అభ్యర్థి చిలుక రవీందర్, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మాచర్ల సౌజన్య ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Arnakonda, Bhupalapatnam, Chakunta, Chityalpalli, Choppadandi, Gumlapur, Katnepalli, Kolimikunta, Konerupalli, Ragampeta, Rukmapur, Vedurughattu
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చొప్పదండి (Choppadandi): చొప్పదండి కరీంనగర్ జిల్లాకు చెందిన పట్టణం మరియు మండల కేంద్రము. ఇది అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానూ ఉంది. పట్టణంలో శివకేశవ ఆలయం ఉంది. 2019లో దేశంలోని 15579 పోలీస్ స్టేషన్లలో చొప్పదండి పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా టాప్-10లో నిలిచింది. పట్టణ పిన్‌కోడ్ 505415. 2018లో ఇది కొత్తగా పురపాలక సంఘంగా ఏర్పడింది. కరీంనగర్ నుంచి ధర్మపురి వెళ్ళు రహదారిపై ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Choppadandi Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి