కరీంనగర్ గ్రామీణ కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. సాహితీవేత్త జువ్వాడి గౌతమరావు ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. కరీంనగర్ మండలంలోని 14 గ్రామాలను విడదీసి కొత్తగా కరీంనగర్ గ్రామీణ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున చొప్పదండి మండలం, దక్షిణాన మానకొండూర్ మండలం, పశ్చిమాన కొత్తపల్లి మండలం, వాయువ్యాన రామడుగు మండలం, నైరుతిన కరీంనగర్ పట్టణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. రాజకీయాలు: ఈ మండలము కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పారుమల్లి లలిత ఎన్నికయ్యారు. రవాణా సౌకర్యాలు:
కరీంనగర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Arepalli, Bommakal, Chamanpalli, Chegurthi, Cherlabuthkur, Durshed, Elbotharam, Fakeerpet, Irukulla, Jublinagar, Maqdumpur, Nagunur, Taharakondapur, Vallampahad
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఇరుకుల్ల (Irukulla): ఇరుకుల్ల కరీంనగర్ జిల్లా కరీంనగర్ గ్రామీణ మండలమునకు చెందిన గ్రామము. సాహితీవేత్త జువ్వాడి గౌతమరావు ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Karimnagar Rural Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి