గన్నేరువరం కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు బెజ్జంకి మండలంలో ఉన్న 12 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 16 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మాసనాదేవి ఆలయం కాసింపేటలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కొత్తపల్లి మండలం, ఈశాన్యాన కరీంనగర్ మండలం, తూర్పున తిమ్మాపూర్ మండలం, పశ్చిమాన రాజన్న సిరిసిల్ల జిల్లా, దక్షిణాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మాడ్గుల రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ganneruvaram, Paruvella, Kashimpet, Madhapur, Mailaram, Jangapalli, Sangem, Gopalpur, Gunukula Kondapur, Yaswada, Panthul Kondapur, Cherlapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గన్నేరువరం (Ganneruvaram): గన్నేరువరం కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గన్నేరువరంలో శ్రీ లక్ష్మీ నరసింస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. కాసింపేట (Kasimpet):
కాసింపేట కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామంలో దక్షిణ భారతదేశంలోనే ఏకైక మానసాదేవి ఆలయం ఉంది. దేశంలో హరిద్వార్ తర్వాత కాసింపేటలోనే శివుడి మానస పుత్రికగా భావించే మానసాదేవి ఆలయం నెలకొని ఉంది. నాగజాతికి మాతృసమానురాలిగా మానసాదేవిని ఆరాధిస్తారు. మాధాపూర్ (Madhapur): మాధాపూర్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలమునకు చెందిన గ్రామం. 2016-17 సం.కిగాను ఈ పంచాయతి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతి పురస్కారం అందుకుంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ganneruvaram Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి