మానకొండూరు కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజన్, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలానికి ఉత్తర సరిహద్దులో మానేరు నది ప్రవహిస్తోంది.
ప్రభుత్వ విప్‌గా, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన ఆరేపల్లి మోహన్, సాహితీవేత్త ముద్దసాని రాంరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున వీణవంక మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన శంకరపట్నం మండలం, పశ్చిమాన తిమ్మాపూర్ మండలం, ఉత్తరాన కరీంనగర్ గ్రామీణ మండలం మరియు పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 67757. ఇందులో పురుషులు 33876, మహిళలు 33881. రాజకీయాలు: ఈ మండలము మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన ఆరేపల్లి మోహన్ ఈ మండలమునకు చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ముద్దసాని సులోచన, జడ్పీటీసిగా తెరాసకు చెందిన తాళ్లపల్లి శేఖర్ ఎన్నికయ్యారు.
మానకొండూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Annaram, Chenjerla, Devampalli, Edulagattepalli, Gangipalli, Gattududdenapalli, Kelledu, Kondapalkala, Lalithapur, Lingapur, Maddikunta, Manakondur, Munjampalli, Pachunur, Utoor, Vannaram, Vegurupall, Veldi
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఊటూరు (Utoor): ఊటూరు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ సాహితీవేత్త ముద్దసాని రాంరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 1967లో రోడ్డు ప్రమాదంలో గాయబడి 39 సం.లు మంచానికే పరిమితమై సాహితీసేవ చేశారు.సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు. మానకొండూరు (Mankondur): మానకొండూరు కరీంనగర్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల్ కేంద్రము. ఈ గ్రామానికి చెందిన ఠాకూర్ మహాదేవ్ సింగ్ నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. హైదరాబాదు భారతయూనియన్‌లో విలీనం అనంతరం విడుదలయ్యారు. ఆరేపల్లి మోహన్ జడ్పీ చైర్మెన్‌గా, ప్రభుత్వ విప్ పదవి పొందారు. శ్రీనివాస్ నగర్ (Srinivas Nagar): శ్రీనివాస్ నగర్ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలానికి చెందిన గ్రామము. లోయర్ మానేరు డ్యాం ముంపునకు గురైన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకోసం మానకొండూర్ శివారులో శ్రీవెంకటేశ్వరస్వామి గుట్ట సమీపంలో ఆవాసం కల్పించారు. ప్రారంభంలో మానకొండూర్ పంచాయతి శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం 1995లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఆదర్శ గ్రామప్ంచాయతీగా నిలిచి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతి పురస్కారం పొందింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Manakondur Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి