దామెర వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. .మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా జాతీయ రహదారి నెం 202 వెళ్ళుచున్నది. ఆగస్టు 2018లో దామెర మండలంలోని 3 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన నడికూడ మండలంలో కలిపారు.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం వరంగల్ గ్రామీణ జిల్లాలో పశ్చిమ భాగంలో వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున ఆత్మకూరు మండలం, దక్షిణాన గీసుకొండ మండలం, ఉత్తరాన నడికూడ మండలం, పశ్చిమాన వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దుగా ఉంది.
రాజకీయాలు:
ఈ మండలం పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కాగితాల శంకర్, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన గరిగె కల్పన ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Damera, Kogilvai, Lyadella, Mustyalapally, Oblapur, Oorugonda, Pasaragonda, Pulukurthy, Singarajpally, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
దామెర (Damera): దామెర వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామానికి చెందిన ముద్దసాని సహోదర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెరాస నుంచి పరకాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Damera Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి