దుగ్గొండి వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. దుగ్గొండి వరంగల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 34 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగ్ంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఈశాన్యాన నల్లబెల్లి మండలం, తూర్పున నర్సంపేట మండలం, దక్షిణాన చెన్నారావుపేట మండలం, పశ్చిమాన గీసుకొండ మండలం, వాయువ్యాన మరియు ఉత్తరాన ఆత్మకూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42070. ఇందులో పురుషులు 20996, మహిళలు 21074.
రాజకీయాలు:
ఈ మండలము నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కాట్ల కోమల, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన ఆకుల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Adavi Rangapur, Chalparthi, Duggondi, Keshwapur, Laxmipur, Madhira Mandapalli, Mahammadapur, Mallampalli, Mandapalli, Muddunoor, Nachinapalli, Polaram, Ponakal, Reballi, Rekampalli, Timmampet, Togarrai, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కేశవాపురం (Keshavapuram): కేశవాపురం వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలంనకు చెందిన గ్రామము. 2009లో తెదేపా తరఫున నర్సంపేట నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇతను 3 సార్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Duggondi Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి