గార్ల మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు, కాకతీయుల కాలం నాటి ఆలయాలున్నాయి. కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన బయ్యారం మండలం, దక్షిణాన డోర్నకల్ మండలం, పశ్చిమాన కురవి మండలం, తూర్పున ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 37100. ఇందులో పురుషులు 18229, మహిళలు 18871.
రాజకీయాలు:
ఈ మండలము ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ఎం.శివాజీ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన జాతోల్ ఝాన్సీరాణి ఎన్నికయ్యారు.
గార్ల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Buddharam, Chandragiri, Garla, Gopalapuram, Kannaigudem, Maddi Vancha, Mulkanoor, Pocharam, Pulluru, Rampuram, Seripuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గార్ల (Garla): గార్ల మహబూబాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామానికి రైలు సదుపాయం ఉంది. కాజీపేట-విజయవాడ మార్గంలో గార్ల రైల్వేస్టేషన్ ఉంది. మద్దివంచ (Maddivancha): మద్దివంచ మహబూబాబాదు జిల్లా గార్ల మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో పురాతనమైన అభయాంజనేయస్వామి ఆలయం ఉంది. పుల్లూరు (Pullur): పుల్లూరు మహబూబాబాదు జిల్లా గార్ల మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ కాకతీయుల కాలంనాటి శివాలయం ఉంది. రాతిస్తంబాలనే శిల్పాలు చెక్కి ఆలయాన్ని నిర్మించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Garla Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి