హసన్‌పర్తి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము.మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. ఢిల్లీ-కాజీపేట రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. మండలంలో ఎస్‌ఆర్ (శ్రీరాజరాజేశ్వర) ప్రైవేటు యూనివర్సిటీ నిర్మిస్తున్నారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఎల్కతుర్తి మండలం మరియు కమలాపూర్ మండలం, దక్షిణాన హన్మకొండ మండలం, పశ్చిమాన ధర్మసాగర్ మండలం, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 82909. ఇందులో పురుషులు 41765, మహిళలు 41144. మండలంలో పట్టణ జనాభా 42616, గ్రామీణ జనాభా 40293.
రాజకీయాలు:
ఈ మండలము వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కేతపాక సునీత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన రేణుకుంట్ల సునీత విజయం సాధించారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ananthasagar, Arvapalle, Bhimaram , Chinthagattu , Devannapet, Hasanparthy , Jaigiri, Laknavaram (D), Madipalle, Mallareddipalli, Mutcherla, Nagaram, Pegadapalli, Pembarthy, Siddhapoor, Sudanpalle, Vangapahad, Yellapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అనంతసాగర్ (Anathasagar) : అనంతసాగర్ వరంగల్ పట్టణ జిల్లా హసన్‌పర్తి మండలమునకు చెందిన గ్రామము. అనంతసాగర్‌లో ఎస్‌ఆర్ (శ్రీరాజరాజేశ్వర) ప్రైవేటు యూనివర్సిటీ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Hasanparthy Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి