8, ఆగస్టు 2020, శనివారం

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (Chellapilla Venkata Sastry)

జననం
ఆగస్టు 8, 1870
స్వస్థలం
కడియం
రంగం
సాహితీవేత్త, శతావధాని
మరణం
1950
ప్రముఖ తెలుగు సాహితీవేత్త, శతావధానిగా పేరుపొందిన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ఆగస్టు 8, 1870న తూర్పుగోదావరి జిల్లా కడియంలో జన్మించారు. బాల్యం నుంచే తెలుగు సాహిత్యంలో పట్టు సాధించిన చెళ్లపిళ్ల 17 సం.ల వయస్సులోనే యానాం వేంకటేశ్వరుడిపై శతకం రాశారు. కాశీ వెళ్లి పలువురి పండితుల వద్ద వ్యాకరణ, తర్కశాస్త్రాలు, సంస్కృత చందస్సు నేర్చుకున్నారు. కొంతకాలం రాజమండ్రిలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్య అభ్యసించారు. ఆ తర్వాత కడియడ్లలో చర్లబ్రహ్మయ్య శాస్త్రి వద్ద శిష్యుడిగా చేరారు.

చర్లబ్రహ్మయ్య శాస్త్రి వద్ద అదివరకే శిష్యునిగా ఉన్న దివాకర్ల తిరుపతి శాస్త్రితో విద్యాస్పర్ద ఏర్పడింది. గురువు చర్లబ్రహ్మయ్య శాస్త్రి "మీరిద్దరూ ఒకటైతే తెలుగు సాహిత్యంలో మీకు పోటీరాగలవారు ఉండరు" అన్న మాట ప్రకారం జంటకవులుగా ఏర్పడ్డారు. ఇద్దరూ ఇంటిపేర్లు తీసివేసి తిరుపతి వేంకటకవులు పేరుతో జంటకవులుగా మారి శతావధానాలు చేశారు.

తొలిసారిగా 1892లో కాకినాడలో ఇద్దరు కల్సి శతావధానం చేసి గండపెండేరాన్ని తొడిగించుకున్నారు. జంటకవులుగా ఎన్నో రాజస్థానాలు, సంస్థానాలు సందర్శించి, తమ సాహితీ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు అందుకున్నారు. సాధారణంగా కవులు, సాహితీవేత్తలు మీసాలు పెంచరు కాని వీరు మీసాలు పెంచి సాహిత్యంలో తమను ఓడిస్తే మీసాలు తీసి గెల్చినవారి పాదాలచెంత ఉంచుతామని సవాలు విసిరారు.

జంట కవిత్వం చేసే సమయంలో పలు వివాదాలు ముఖ్యంగా తోటి జంటకవులతో ఎదుర్కొనారు. చివరికి గురువు శ్రీపాద కృష్ణమూర్తి తో కూడా వివాదం ఏర్పడింది. తమ కవితాప్రతిభతో ఏనుగునెక్కిన జంటవులే కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. కాని చివరి దశలో మాత్రం శాంతంగా రచనలు చేశారు. 
 
1920లో తమ రచనలను "తిరుపతి వేంకటేశం" పేరుతో విడుదల చేశారు. చెళ్లపిళ్ల బందరు కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మ ఈయన శిష్యులు. తిరుపతి వేంకటశాస్త్రి 1920లో మరణించిన తర్వాత కూడా చెళ్ళపిళ్ళ "తిరుపతి వేంకటేశం" పేరుతోనే రచనలు చేశారు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 1950లో మరణించారు.
 
 
ఇవి కూడా చూడండి
 


హోం
విభాగాలు: తెలుగు సాహితీవేత్తలు, తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక