మహాదేవ్‌పూర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 32 రెవెన్యూ గ్రామాలు కలవు. ఉత్తరాన, పశ్చిమాన, తూర్పున మూడు వైపులా గోదావరి నది సరిహద్దుగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది గోదావరిలో సంగమించే ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఈ మండలంలోనే ఉంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. అదే సమయంలో ఈ మండలంలోని 17 గ్రామాలను విడదీసి కొత్తగా పలిమెల మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన కాటారం మండలం, ఆగ్నేయాన ముత్తారం మహాదేవ్‌పూర్ మండలం, పశ్చిమాన మంచిర్యాల జిల్లా, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరాన, పశ్చిమాన, తూర్పున మూడు వైపులా గోదావరి నది సరిహద్దుగా ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38472. ఇందులో పురుషులు 18918, మహిళలు 19554. అక్షరాస్యత శాతం 53.33%.
రాజకీయాలు:
ఈ మండలం మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పీటీసి సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడాల అరుణ విజయం సాధించారు.
మహాదేవ్‌పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ambatpalli, Annaram, Balijapur, Beersagar, Beglur, Bommapur, Brahmanapalli, Chindrapalli, Edapalli, Elkeswaram, Kaleswaram, Kancherlapalli, Kannepalli, Kishtaraopet, Kothapeta, Kudurpalli, Kuntlam, Laxmipur, Mahadevpur, Majeedpalli, Medigadda, Metpalli, Muddulapalli, Muktipalli, Nagepalli, Palgula, Peddampet, Puskupalli, Rapallekota, Suraram, Tallagadda, Yenkepalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కాళేశ్వరం (Kaleshwaram): కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గ్రామము. ఇది భౌగోళికంగానూ, అధ్యాత్మికంగానూ ప్రసిద్ధి చెందిన గ్రామము. గోదావరి, ప్రాణహిత నదుల సంగమప్రాంతంగానే కాకుండా ముక్తీశ్వర ఆలయం కూడా ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mahadevpur Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి