1, ఆగస్టు 2020, శనివారం

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna)

స్వస్థలంవిజయవాడ
రంగంరచయిత
పురస్కారాలు
ప్రతిభా శిరోమణి


డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ స్వస్థలం విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గ్రామం. గణితం, తెలుగు, జర్నలిజం, మనస్తత్వశాస్త్రాల్లో ఎం.ఎ, ఎం.ఈడి., 'గణితంలో సహపాఠ్యకార్యక్రమాలు' అనే అంశంపై ఎం.ఫిల్‌, 'కృష్ణాజిల్లా పత్రికా రంగం' అనే అంశంపై పి.హెచ్‌.డి చేశారు. వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రామకృష్ణ పీహెచ్‌.డి థీసిన్‌ను బి.ఎ (తెలుగు) విద్యార్థులకు రిఫరెన్స్‌ బుక్‌గా యు.జి.సి. ప్రకటించింది.

రచయితగా బీఈడీ, డీఈడీ విద్యార్థుల కోసం 15 పాఠ్యపుస్తకాలు రచించారు. నిత్యోత్సవం, ఆంధ్రుల ఆత్మజ్యోతి శ్రీకృష్ణదేవరాయలు, నడుస్తున్న చరిత్ర, సామెతలు, పొడుపుకథలు, తెలుగు ఇంగ్లిషు నిఘంటువు, నడుస్తున్న చరిత్ర, అందమైన ఆంధ్రప్రదేశ్‌, మనసుమాట గెలుపుబాట, శ్రీసూర్యోపాసన వంటి ఇతర పుస్తకాలు 20 రచించారు.  మానవ మనోవిజ్ఞానశాస్త్రంపై రాసిన రెండు పుస్తకాలను తెలుగు అకాడమి (హైదరాబాదు) ప్రచురించింది. శ్రీశైలప్రభ, భక్తి, సప్తగిరి, శ్రీకనకదుర్గప్రభ, ఋషిపీఠం, తెలుగు వెలుగు, బాలభారతం, గ్రంథాలయ సర్వస్వం, కస్తూరి (రాష్ట్రప్రభుత్వం పక్షాన సర్వశిక్షా అభియాన్‌ ప్రచురిస్తున్న పత్రిక) తదితర పత్రికల్లో పదుల సంఖ్యలో వ్యాసాలు, పుస్తక సమీక్షలు రచించారు. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ప్రచురించిన తెలుగు పాఠ్యపుస్తకాలకు సంపాదకుడిగా, రచయితగా పనిచేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (ఎన్‌.ఐ.ఒ.ఎస్‌) పుస్తకాలకు అనువాదకుడిగా పనిచేశారు. డి.ఎల్‌.ఇడి రెండో సంవత్సరం విద్యార్థులకు 'గణిత బోధన పద్ధతులు' పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి. ప్రచురించింది. విద్యావిషయకంగా రెండు జాతీయ సదస్సులు నిర్వహించారు. సుమారు 50 జాతీయ సదస్సులు, మూడు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్రసమర్పణ చేశారు. అనేక విద్యావిషయక పత్రికల్లో వీరి పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

విజయవాడ మారిస్‌ స్టెల్లా కళాశాలలో నిర్వహించే 'సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ టీచర్‌ ట్రైనింగ్‌'కు సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఇడి. విద్యార్థులకు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన పరిశోధన మార్గదర్శకుడిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే వివిధ కోర్సులకు 'రిసోర్స్‌ పర్సన్‌' వ్యవహరిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం వంటి విద్యాసంస్థలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, వివిధ పాఠశాలల్లోను ఉద్యోగ నియామక సంఘ సభ్యుడిగా ఉన్నారు.  అనేక పాఠశాలలు, కళాశాలల్లో గౌరవోపన్యాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహా పలు సంస్థలు నిర్వహించిన విద్యావిషయక ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. విజ్ఞానభారతి వంటి సంస్థల్లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు.పాత్రికేయునిగా ఈనాడు, సాక్షి, విశాలాంధ్ర దినపత్రికల్లో రెండువందలకు పైగా వ్యాసాలు వివిధ అంశాలపై రచించారు. ఈనాడు దినపత్రిక సంపాదకీయ పేజీలో ఐదు ప్రత్యేక వ్యాసాలు రాశారు. ఈనాడు ప్రధాన సంచికలోని మకరందం శీర్షికలో పదుల సంఖ్యలో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా పాఠశాల విద్యార్థులకు గణితాంశాలపై పాఠాలు, పలువురు ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడలో జరిగే పలు సాహిత్య, విద్యావిషయక కార్యక్రమాలపై సమీక్షా ప్రసంగాలు కూడా చేశారు. శ్రీ మాడుగుల నాగఫణిశర్మ, శ్రీ గరికిపాటి నరసింహారావు, శ్రీ ఆముదాల మురళి, శ్రీ రాంభట్ల పార్వతీశ్వరశర్మ తదితరుల అష్టావధానాల్లో పృచ్ఛకుడిగా వ్యవహరించారు. భువనవిజయం తదితర సాహిత్య రూపకాల్లో పాల్గొన్నారు. గణితచంద్రిక మాసపత్రిక సంపాదమండలి సభ్యునిగా, పలు పాఠశాలలకు విద్యావిషయక సలహాదారుగా, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరీక్షల పరిశీలకునిగా, కృష్ణా విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సభ్యునిగా.. ఇంకా అనేక హోదాల్లో పనిచేశారు. స్కోర్‌మోర్‌ ఫౌండేషన్‌ సంస్థ వీరిని 'ప్రతిభా శిరోమణి' పురస్కారంతో ( 2016 జనవరి 29) సన్మానించింది. వివిధ సందర్భాల్లో వైజ్‌క్లబ్‌, రోటరీ క్లబ్‌, వాకర్స్‌ క్లబ్‌ వంటి అనేక సంస్థలు వీరిని సత్కరించాయి.



ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: కృష్ణా జిల్లా ప్రముఖులు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక