మొగుల్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. భౌగోళికంగా ఇది జిల్లాలో అతిపశ్చిమాన ఉన్న మండలం. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35901. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. అదే సమయంలో ఈ మండలంలోని 2 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పడిన పలిమెల మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఇది జిల్లాలో అతిపశ్చిమాన ఉన్న మండలం. ఈ మండలానికి ఉత్తరాన టేకుమట్ల మండలం, తూర్పున చిట్యాల మండలం, దక్షిణాన వరంగల్ గ్రామీణ జిల్లా, పశ్చిమాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39409. ఇందులో పురుషులు 19712, మహిళలు 19697.
రాజకీయాలు:
ఈ మండలము భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాస పార్టీకి చెందిన యార సుజాత ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా తెరాస పార్టీకి చెందిన జోరుక సాదయ్య విజయం సాధించారు.
మొగుల్లపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akinepalli, Ankushapur, Gudipahad, Gundlakarthi, Issipet, Kurkishala, Medaramatla, Metpalli, Mogullapalli, Motlapalli, Mulkalapalli, Parlapalli, Peddakomatipalli, Pidisilla, Pothugal, Rangapuram, Vemulapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Mogullapalli Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి