ములుగు ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో కొత్తూరు సమీపంలోని గుట్టలపై అద్భుత శిల్పసంపద, దేవునిగుట్ట ప్రాచీన ఆలయం ఉంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన పోరిక బలరాం నాయక్ ఈ మండలమునకు చెందినవారు. 2016కు ముందు వరంగల్ జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన వెంకటాపూర్ మండలం, తూర్పున గోవిందరావుపేట మండలం, దక్షిణాన మహబూబాబాదు జిల్లా మరియు వరంగల్ గ్రామీణ జిల్లా, పశ్చిమాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా జాతీయ రహదారి నెం. 202 వెళ్ళుచున్నది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62125. ఇందులో పురుషులు 31411, మహిళలు 30714.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన పోరిక బలరాం నాయక్ ఈ మండలమునకు చెందినవారు. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన గండికోట శ్రీదేవి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన సకినాల భవాని ఎన్నికయ్యారు.
ములుగు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Abbapuram, Ankannagudem, Annampalli (D), Bandarupalli, Incherla, Jaggannapet, Jakaram, Kannaigudem, Kasimdevipet, Kothur, Madanapalli, Mallampalli, Mulug, Pathepalli, Pegadapalli, Potlapur, Ramachandrapuram, Ranabandala (D), Sarvapuram,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొత్తూరు (Kothur):
కొత్తూరు ములుగు జిల్లా ములుగు మండలమునకు చెందిన గ్రామము. గ్రామసమీపంలో గుట్టలపై పురాతనమైన ఆలయం ఉంది. ఇది దేవునిగుట్ట ఆలయంగా (Devunigutta Temple) ప్రసిద్ధి చెందింది. కంబోడొయాలోని అంకోర్‌వాట్ ఆలయం వలె చిన్నచిన్న రాళ్లకే రూపాన్నిచ్చి మూర్తులుగా చేయడం ఇక్కడి ఆలయం విశిష్టత. మదనపల్లి (Madanapalli): మదనపల్లి వరంగల్ జిల్లా ములుగు మండలమునకు చెందిన గ్రామము. కేంద్ర మంత్రిగా పనిచేసిన పోరిక బలరాం నాయక్ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mulugu Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి