మంగపేట ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 25 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం ఈశాన్య సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. మల్లూరులో ప్రసిద్ధి చెందిన హేమాచల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. సీబీఐ డైరెక్టరుగా పనిచేసిన మన్నెం నాగేశ్వరరావు ఈ మండలానికి చెందినవారు. మండలంలో అటవీప్రాంతం (ఏజెన్సీ ఏరియా) ఉంది. 2016కు ముందు వరంగల్ జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మరియు ఈశాన్యాన వెంకటాపురం మండలం, పశ్చిమాన తాడ్వాయి (సమ్మక్క సారక్క) మండలం, వాయువ్యాన ఏటూరు నాగారం మండలం, దక్షిణాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఈశాన్య సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49020. ఇందులో పురుషులు 24491, మహిళలు 24529. మండలంలో పట్టణ జనాభా 11610, గ్రామీణ జనాభా 3741.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
మంగపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akinepalle Mallaram, Bandarugudem, Barlagudem, Brahmanapalle, Cherupalle, Chunchupalle, Domeda, Gollagudem, Kamalapuram, Kathigudem, Komatipalle, Lodukagudem, Mallur, Mangapet (Podmur), Narsapur (Mangapet), Narsimhasagar, Pooredipally, Rajupet, Ramachandrunipet, Ramanakkapet, Thimmampet, Tondyala Laxmipur, Wadagudem
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మల్లూరు (Mallur): మల్లూరు ములుగు జిల్లా మంగపేట మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఏటా వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయం సమీపంలో రెండు చింతామణి జలపాతాలున్నాయి. నరసాపురం (Narsapuram):
నరసాపురం ములుగు జిల్లా మంగపేట మండలమునకు చెందిన గ్రామము. సీబిసి డైరెక్టరుగా పనిచేసిన మన్నెం నాగేశ్వరరావు ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mangapet Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి