23, ఆగస్టు 2020, ఆదివారం

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam)

జననం
జూన్ 4, 1946
రంగం
సినిమా పాటల గాయకుడు
ప్రత్యేకత
40వేల పాటలుపాడి గిన్నిస్ రికార్డు
పురస్కారాలు
పద్మభూషణ్ (2011), జాతీయ ఫిలిం అవార్డు,
మరణం
సెప్టెంబరు 25, 2020
సినిమా పాటల గాయకుడిగా ప్రఖ్యాతిచెందిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జూన్ 4, 1946న నెల్లూరులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. సంక్షిప్తంగా ఈయన బాలుగా, ఎస్పీబిగా ప్రసిద్ధి చెందారు. తండ్రి ఎస్పీ సాంబమూర్తి హరికథ కళాకారుడు, సోదరి ఎస్.పి.శైలజ గాయనిగా ప్రసిద్ధి చెందింది. 16 భాషలలో కలిపి 40,000కుపైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన బాలసుబ్రహ్మణ్యం ఎన్నో జాతీయ, రాష్ట్ర సినీ అవార్డులు, భారత ప్రభుత్వంచే 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. సెప్టెంబరు 25, 2020న మరణించారు.

గాయకుడిగా ప్రస్థానం:
గాయకుడిగా ఎస్పీ తొలి సినిమా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1966). తన బంధువైన ఎస్.పి.కోదండపాణి వల్ల నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఈయనకు తొలిసారిగా సినీగాయకునిగా అవకాశం లభించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో కాకుండా 16 భాషా సినిమాలలో పాటల ద్వారా తన గానాన్ని వినిపించారు. నటుడిగా కూడా బాలు కొన్ని సినిమాలలో నటించారు. ఈటీవి పాడుతా తీయగా కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. ఈటీవి స్వరాభిషేకం కార్యక్రమంలో కూడా గానాన్ని వినిపించారు

పురస్కారాలు:
బాలసుబ్రహ్మణ్యం తన గానం ద్వారా 6 ఫిలింఫేర్ అవార్డులను, 25 సార్లు నంది అవార్డులను, 6 ఫిలింఫేర్ సౌత్ అవార్డుల, ఒకసారి జాతీయ ఫిలిం అవార్డు, తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలు రాష్ట్ర అవార్డులు పొందారు. ఫిలింఫేర్ అవార్డులను 6 సార్లు పొందగా అందులో 3 అవార్డుకు తెలుగు సినిమాలకు చెందినవి (శంకరాభరణం, సాగరసంగమం, రుద్రవీణ). 6 సార్లు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు పొందగా అందులో 2 తెలుగు సినిమాలకు చెందినవి (శుభసంకల్పం, శ్రీరాముడు). 1989లో మైనే ప్యార్ క్యా సినిమాకై బాలు జాతీయ ఫిలిం అవార్డు, 2012లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు పొందారు. 2016లో 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జీవితసాఫల్య అవార్డు పొందారు.

కుటుంబం:
భార్య సావిత్రి, కుతూరు పల్లవి, కుమారుడు ఎస్.పి.చరణ్ (ఈయన కూడా గాయకుడు, దర్శకుడు). సొదరి ఎస్.పి.శైలజ కూడా గాయనిగా ప్రసిద్ధి చెందింది.
 
 
ఇవి కూడా చూడండి:
  • ఎస్.పి.శైలజ,
  • ఎస్.పి.చరణ్,
  • ఎస్.పి.కోదండపాణి, 
  • జూన్ 4
  • 2020,


హోం
విభాగాలు: నెల్లూరు జిల్లా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రముఖులు, 2020,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక