పలిమెల జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 2 ఎంపీటీసి స్థానాలు, 8 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు మహాదేవ్‌పూర్ మండలంలో ఉన్న 17 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన మరియు పశ్చిమాన ముత్తారం మహాదేవ్‌పూర్ మండలం, ఉత్తరాన మరియు తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర మరియు తూర్పు సరిహద్దుల గుండా గోదావరి నరి ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38472. ఇందులో పురుషులు 18918, మహిళలు 19554. అక్షరాస్యత శాతం 53.33%.
రాజకీయాలు:
ఈ మండలం మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పీటీసి సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండబోయిన హేమలత విజయం సాధించారు.
పలిమెల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bheemanpalli, Boyapalmela, Burugugudem, Dammur, Garkapalli, Kamanpalli, Kishtapur, Lenkalagadda, Medigadda, Moded, Mukunur, Neelampalli, Palimela, Pankena, Sarvaipet, Thimmetigudem, Venchapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Palimela Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి