టేకుమట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 27985. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు చిట్యాల మండలంలో ఉన్న 16 గ్రామాలు, మొగుళ్ళపల్లి మండలంలోని 2 గ్రామాలతో కలిపి 18 గ్రమాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున చిట్యాల మండలం, దక్షిణాన మొగుళ్లపల్లి మండలం, ఉత్తరాన పెద్దపల్లి జిల్లా, పశ్చిమాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా 353సి జాతీయ రహదారి వెళ్ళుచున్నది. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. రాజకీయాలు:
ఈ మండలము భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాస పార్టీకి చెందిన రెడ్డి మల్లారెడ్డి ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా తెరాస పార్టీకి చెందిన పులి తిరుపతి రెడ్డి విజయం సాధించారు.
టేకుమట్ల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ankushapur, Bornapalli, Dubyala, Empedu, Garmillapalli, Gummadavalli, Kalikota, Kundanpalli, Pangidipalli, Raghavapur, Raghavareddypet, Ramakistapur (T), Ramakistapur (V), Somanpalli, Tekumatla, Velchal, Vellampalli, Venkatraopalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
వెల్లంపల్లి (Vellampalli): వెల్లంపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన గ్రామము. ప్రముఖ సినీగేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tekumatla Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి