తాడ్వాయి (సమ్మక్క-సారక్క) ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 73 రెవెన్యూ గ్రామాలు కలవు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జారత సమ్మక్క-సారక్క జాతర ఈ మండలంలోని మేడారంలో జరుగుతుంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 22809. 2020 ఫిబ్రవరిలో మేడారం జాతర సందర్భంగా తాడ్వాయి మండలాన్ని తాడ్వాయి (సమ్మక్క సారక్క) మండలంగా పేరుమార్పు చేశారు. 2016కు ముందు వరంగల్ జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున ఏటూరునాగారం మండలం మరియు మంగపేట మండలం, పశ్చిమాన గోవిందరావు పేట మండలం మరియు వెంకటాపూర్ మండలం, ఉత్తరాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దక్షిణాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా జాతీయ రహదారి నెం.202 వెళ్ళుచున్నది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 22809. ఇందులో పురుషులు 10832, మహిళలు 11977. స్త్రీపురుష నిష్పత్తి 1106/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన గొంది వాణిశ్రీ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన బడే నాగజ్యోతి ఎన్నికయ్యారు.
తాడ్వాయి (సమ్మక్క-సారక్క) మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adhervai, Alligudem, Ankampalle, Annaram, Ashannagudem Yellapur, Banjarellapur, Bayyakkapet, Beerelli, Bhupatipuram, Bittupalle (P.L), Bodigudem, Bollepalle (P.L), Bondal, Budigevanipahad, Chinnapuram, Chinthalakatapuram, Chowled, Damervai, Durgaram, Elbaka, Gangaram (P.A), Gonepalle, Gopaigudem (PA), Gouraram (PA), Immadigudem, Jampangavai, Kalwapalle, Kamaram (P.A), Kamaram (P.T), Kamisettigudem, Kanneboinapalle, Katapuram, Katnarsapuram, Keshavapoor, Kishtapuram, Kondaiguda, Kondalanagaram, Kondaparthi, Kothagudem (PL), Kothur (Pattipangidi), Kousettivai, Lavval, Laxmipuram (PA), Lingala, Maredigudem, Medaram (D), Medaram (Sammakkajatara), Motlagudem, Narlapur, Narsapur (P.A), Narsapur (P.L), Nimmagudem, Nimmakayalanagaram, Oorattam, Padigapuram (P.P), Padigapuram (PA), Pambapuram, Pocha Palle, Ramannagudem, Rampoor (PA), Rangapuram (P.A), Sattaram, Serigaram, Somaigudem, Tadvai, Takkallagudem, Thimmatogu, Uppukunta, Veerapuram, Vengalapuram, Venkannagudem, Voddegudem (PL), Waddegudem
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు బయ్యక్కపేట (Bayyakkapet): బయ్యక్కపేట ములుగు జిల్లా తాడ్వాయి మండలమునకు చెందిన గ్రామము. 1962కు ముందు సమ్మక్క సారక్క జాతర ఈ గ్రామంలోనే జరిగేది. బీరెల్లి (Beerelli): బీరెల్లి ములుగు జిల్లా తాడ్వాయి మండలమునకు చెందిన గ్రామము. 2014, ఆగస్టు 15 నాడు బీరెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ముఖ్యమంత్రిచే పురస్కారం లభించింది. మేడారం (Medaram):
మేడారం ములుగు జిల్లా తాడ్వాయి మండలమునకు చెందిన గ్రామము. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఇక్కడ రెండేళ్ళకోసారి జరుగుతుంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tadwai Sammakka Sarakka Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి