చంద్రుగొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. జిల్లాల పునర్విభజనలో ఈ మండలంలోని 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా అన్నపురెడ్డిపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున అన్నపురెడ్డిపల్లి మండలం, పశ్చిమాన జూలూరుపాడు మండలం, ఉత్తరాన సుజాతానగర్ మండలం మరియు చుంచుపల్లి మండలం, దక్షిణాన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49055. ఇందులో పురుషులు 25029, మహిళలు 24026. స్త్రీపురుష నిష్పత్తి 960/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలము అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2006లో జరిగిన ఎంపీపీ, జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బానోత్ పార్వతి ఎన్నికయ్యారు మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chandrugonda, Damarlacherla, Ganugapadu, Gurramgudem, Maddukuru, Pokalagudem, Raikampadu, Sethaigudem, Tippanapally, Tungaram,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చంద్రుగొండ (Chandrugonda): చంద్రుగొండ భద్రద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. నవంబరు 24, 2011న ఇందిర జలప్రభ పథకాన్ని చంద్రుగొండలో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chandrugonda Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి