పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 36 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. కిన్నెరసాని నదిపై నిర్మించబడిన కిన్నెరసాని ప్రాజెక్టు ఈ మండలంలోనే ఉంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్ ఫెర్రో అలాయ్, స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలు పాల్వంచలో ఉన్నాయి. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున అశ్వాపురం మండలం మరియు బూర్గుంపాడు మండలం, దక్షిణాన ముల్కలపల్లి మండలం, పశ్చిమాన లక్ష్మీదేవిపల్లి మండలం, ఉత్తరాన ఆల్లపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలంగుండా కిన్నెరసాని నది ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 113707. ఇందులో పురుషులు 57328, మహిళలు 56379. పట్టణ జనాభా 80138, గ్రామీణ జనాభా 33569.
రాజకీయాలు:
ఈ మండలము కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014లో ఖమ్మం జిల్లా జడ్పీ వైస్-చైర్మెన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన పాల్వంచ జడ్పీటీసి వాసుదేవరావు ఎన్నికయ్యారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మడి సరస్వతి ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chandralagudem, Dantelaboru, Gangadeviguppa, Karegattu, Koyagutta, Laxmidevipally, Nagaram, Narayanraopeta, Palvancha, Pandurangapuram, PayakariYanambilu, Rangapuram, Repallevada, Sangam, Sarekallu, Somulagudem, Suraram, Thoggudem, Ulvanoor, Yanambilu
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
పాల్వంచ (Palwancha): పాల్వంచ ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది విజయవాడ-జగదల్‌పూర్ మార్గంలో ఉన్నది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్ ఫెర్రో అలాయ్, స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలు పాల్వంచలో ఉన్నాయి. యానంబైలు (Yanambailu):
యానంబైలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంనకు చెందిన గ్రామము. కిన్నెరసాని నదిపై గ్రామపరిధిలో కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మించబడింది
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Palwancha Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి