గుండాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో బొగ్గు నిక్షేపాలున్నాయి. మండలంలోని పడుగోనిగూడెంలో సింధూనాగరికత కాలం నాటి రాక్షసగుళ్ళు లభించాయి. మండలంలో మల్లన్న వాగు ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. అదే సమయంలో ఈ మండలాన్ని విభజించి 8 గ్రామాలతో కొత్తగా ఆళ్లపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున ఆళ్లపల్లి మండలం, దక్షిణాన యెల్లందు మండలం, ఉత్తరాన ములుగు జిల్లా, పశ్చిమాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 27945. ఇందులో పురుషులు 13858, మహిళలు 14087.
రాజకీయాలు:
ఈ మండలము పినపాక అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా న్యూడెమొక్రసి పార్టీకి చెందిన ముక్తిసత్యం ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chinna Venkatapuram, Damaratogu, Galaba, Gundala, Kachanapally, Konavarigudem, lingagudem, Mamakannu, Muthapuram, Padigapuram, Rudrapaka, Sayanapalli, Settypally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gundala Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి