ఆళ్లపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో బొగ్గు నిక్షేపాలున్నాయి. మండలంలో కిన్నెరసాని నది ప్రవహిస్తోంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు గుండాల మండలంలో ఉన్న 8 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన కరకగూడెం మండలం, తూర్పున మణుగూరు మండలం, ఆగ్నేయాన పాల్వంచ మండలం, దక్షిణాన లక్ష్మీదేవిపల్లి మండలం మరియు టేకులపల్లి మండలం, పశ్చిమాన గుండాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 13201.
రాజకీయాలు:
ఈ మండలము పినపాక అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
ఆళ్లపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adaviramavaram, Allapalli, Ananthogu, Appaipeta, Markodu, Olvachalaka, Peddavenkatapuram, Ramanujagudem
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆళ్లపల్లి (Allapalli): ఆళ్లపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2016, అక్టోబరు 11న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ గ్రామం కొత్తగా మండల కేంద్రంగా మారింది. అదేసమయంలో ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలోకి చేరింది. ఈ గ్రామం జిల్లా కేంద్రం నుంచి 40 కిమీ దూరంలో ఉంది. గ్రామం కిన్నెరసాని నది తీరాన ఉంది
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Pinapaka Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి