జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన టేకులపల్లి మండలం, ఈశాన్యాన సుజాతానగర్ మండలం, తూర్పున చంద్రుగొండ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 33421. ఇందులో పురుషులు 16811, మహిళలు 16610.
రాజకీయాలు:
ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన లావుడ్యా సోని ఎన్నికయ్యారు.
జులూర్‌పాడు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Gundepudi, Julurupad, Kakarla, Karivarigudem, Machinenipeta, Nallabandabodu, Padamatinarsapuraam, Papakollu
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కాకర్ల (Kakarla) : కాకర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలమునకు చెందిన గ్రామము. కాకర్ల గ్రామసమీపంలో పాలగుట్టపై స్వయంభూగా వెలిసిన సంతాన వేణిగోపాలస్వామి ఆలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Julurpad Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి