కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు పురపాలక సంఘంలో భాగంగా ఉంది. ఇది బొగ్గు ఖనిజానికి ప్రసిద్ధి. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలం 4 ముక్కలైంది. ఈ మండలం నుంచి విడదీసిన గ్రామాలతో కొత్తగా 3 మండలాలు (సుజాతానగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి) ఏర్పాటయ్యాయి. అదేసమయంలో ఈ మండలం ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మారింది మరియు మండలకేంద్రం జిల్లా కేంద్రంగా హొదా పొందింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన లక్ష్మీదేవిపల్లి మండలం, మిగితా వైపుల సుజాతానగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: ఈ ప్రాంతం నిజాం కాలంలో పాల్వంచ జమీందారుల అధీనంలో ఉండేది. సెప్టెంబరు 17, 1948న నిజాం సంస్థానంతో పాటు ఇది కూడా భారత యూనియన్‌లో చేరింది. హైదరాబాదు విమోచనోద్యమంలో మరియు 1946-51 కాలంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజలు పాల్గొన్నారు. 1948-56 కాలంలో హైదరాబాదు రాష్ట్రంలో, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగింది. 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతంలో ఉధృతంగా సాగింది. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మూలస్థానం పాల్వంచలోని కొత్తగూడెం పవర్ స్టేషన్. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె కొనసాగింది. ఇందులో ప్రధానంగా బొగ్గు కార్మికులు, విద్యాథులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ప్రముఖ పాత్ర వహించారు. జూన్ 2, 2014న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగం కావడమే కాకుండా మండల కేంద్రంగా ఉన్న కొత్తగూడెం జిల్లా కేంద్రంగా మారింది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 187994. ఇందులో పురుషులు 93242, మహిళలు 94752. పట్టణ జనాభా 119450 (పునర్విభజనకు ముందు)
రాజకీయాలు:
ఈ మండలము కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
కొత్తగూడెం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Kothagudem, Ramavaram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొత్తగూడెం (Kothagudem): కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పట్టణం, మండల కేంద్రము, రెవెన్యూ డివిజన్ కేంద్రము మరియు జిల్లా కేంద్రము. ఇది విజయవాడ- జగదల్‌పూర్ మార్గంలో ఉంది. పట్టణంలో సీ.ఎస్.ఐ.చర్చి ఉంది. రాష్ట్రంలో ఏకైక మైనింగ్ కళాశాల కొత్తగూడెంలో ఉంది. పాల్వంచ దీనికి జంటపట్టణము. పాల్వంచలో నవ భారత్ ఇనుము కర్మాగారం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kothagudem Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి