టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 36 గ్రామపంచాయతీలు, 6 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో అటవీప్రాంతం ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆల్లపల్లి మండలం, తూర్పున లక్ష్మీదేవిపల్లి మండలం, దక్షిణాన సుజాతానగర్ మండలం మరియు జూలూరుపాడు మండలం, పశ్చిమాన యెల్లందు మండలం, నైరుతిన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48185. ఇందులో పురుషులు 24341, మహిళలు 23844.
రాజకీయాలు:
ఈ మండలము యెల్లందు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన భూక్యా రాధ ఎన్నికయ్యారు. 2020లో మండలానికి చెందిన లక్కినేని సురేందర్‌రావు (TRS) డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.
టేకులపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bethampudi, Bodu, Gangaram, Gollapally, Koppurai, Pegallapadu
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tekulapalli Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి