నేలకొండపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. భద్రాచలం రామాలయాన్ని నిర్మించిన రామదాసు ఈ మండలానికి చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున ముదిగొండ మండలం, వాయువ్యాన కూసుమంచి మండలం, పశ్చిమాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 61360. ఇందులో పురుషులు 30247, మహిళలు 31113. రాజకీయాలు: ఈ మండలము పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 1978లో పాలేరు నుంచి శాసనసభకు ఎన్నికైన పొట్టిపింజర హుసేనయ్య మండలానికి చెందినవారు. మండలంలోని గ్రామాలు:
Acharlagudem, Anasagar, Aregudem, Biravunapally, Bodulabanda, Buddaram, Chandapuram, Chennaram, Cheruvumadharam, Guvvalagudem, Kattukacharam, Konaigudem, Kongara, Mandrajupally, Mujjugudem, Nachepally, Nelakondapally, Painampally, Rajeswarapuram, Ramachandrapuram, Singireddypalem, Surdeypally, Tirumalapuram,
ప్రముఖ గ్రామాలు: .బోదులబండ (Bodulabanda): బోదులబండ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలమునకు చెందిన గ్రామము. 1978లో పాలేరు నుంచి శాసనసభకు ఎన్నికైన పొట్టిపింజర హుసేనయ్య ఈ గ్రామానికి చెందినవారు. నేలకొండపల్లి (Nelakondapally): నేలకొండపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది చరిత్రాత్మక గ్రామం. ఇది పాండవుల కాలం నుంచి ప్రఖ్యాతిచెందినట్లుగా, విరాట రాజు రాజధానిగా ప్రచారంలో ఉన్నది. బౌద్ధయుగంలో కూడా ఇది ప్రఖ్యాతిగాంచింది. గ్రామంలో శిథిలమైన ఒక బౌద్ధస్తూపం ఉంది. ఒకప్పుడు అమరావతి స్తూపం తర్వాత చెప్పుకోదగ్గ స్తూపంగా ప్రచారంలో ఉండేది. శిథిలమైన స్తూపంను ప్రజలు ఎర్రదిబ్బగా, విరాటరాజు గద్దెగా పిలుస్తారు. గ్రామంలో ప్రాచీనమైన రాజగోపాలస్వామి ఆలయం ఉంది. విరాటరాజు కుమారుడు ఉత్తరుడు నిర్మించినట్లుగా చెప్పుకొనే ఉత్తరేశ్వరాలయం ఉంది. భద్రాచలం రామాలయాన్ని నిర్మించిన రామదాసు ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nelakondapalli Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి